అనువాదలహరి

మార్పు … షెల్లీ

Image Courtesy: http://farm3.static.flickr.com/2606/3904608239_cf3dc43782.jpg

.

అపరాత్రి చంద్రుణ్ణి ఆవరించే మేఘాలవంటివాళ్ళం మనం

అలుపులేకుండా  అవి పరుగెడుతూ, వణుకుతూ, హఠాత్తుగా దీపించి,

చీకటిని చొచ్చుకుని ఒకింత వెలుగుమరక నందిస్తాయి. కాని,

దానితో సరి. రేయి ముగుస్తుండగానే వాటి వెల్లదనం తెల్లబోతుంది.

.

లేదా, విస్మరించిన విపంచిక లాటి వాళ్ళం.

మీటిన ప్రతిసారీ ఒక అపస్వరం పలుకుతూ,

నశ్వరమైన తనువునుండి ఏ ఒక్కసారీ

ఇతః పూర్వపు శృతి గాని, రసానుభూతి గాని  వెలువరించలేకుండా.

.

మనం నిద్రిస్తాం… కానీ, కల నిద్రను విషమింపజేయ గలదు

మనం లేస్తాం… కానీ  నిలకడలేని ఒక ఆలోచన రోజుని పాడుచెయ్యగలదు.

మనం స్పందిస్తాం, ఆలోచిస్తాం, విచారిస్తాం, నవ్వుతాం, లేదా రోదిస్తాం,

దుఃఖాల్ని నెమరువేసుకుని ఆనందించడమో,  లక్ష్యాల్ని విసర్జించడమో చేస్తాం.

.

ఏం చేసినా, అన్నీ ఒకతీరే. అది సంతోషమైనా విచారమైనా,

దాని నిష్క్రమణ మార్గం నిర్నిబంధంగా సాగుతుంది.

మనిషి గతం ఎన్నడూ, రేపటిని పోలి ఉండదు

ఒక్క మార్పు తప్ప … ఏదీ శాశ్వతం కాదు.

.

ఆంగ్ల మూలం :  షెల్లీ
.

Mutability

We are as clouds that veil the midnight moon;

How restlessly they speed, and gleam, and quiver,

Streaking the darkness radiantly!–yet soon

Night closes round, and they are lost forever:

Or like forgotten lyres, whose dissonant strings

Give various response to each varying blast,

To whose frail frame no second motion brings

One mood or modulation like the last.

We rest.–A dream has power to poison sleep;

We rise.–One wandering thought pollutes the day;

We feel, conceive or reason, laugh or weep;

Embrace fond woe, or cast our cares away:

It is the same!–For, be it joy or sorrow,

The path of its departure still is free:

Man’s yesterday may ne’er be like his morrow;

Nought may endure but Mutability.

.

Percy Bysshe Shelley

%d bloggers like this: