His Hug – K. Geetha Image Courtesy: http://corenational.org . There are downs in his hug That can fan out all temporal afflictions. While the six passions steadily subside, only Reassurance rules the roost. Many a time My heartbreaks flowed down his falcate neck, And on his prickly little bony chest My cheeks washed their wounds. Like a woe-less plain presenting itself in a vacuous world, All of a sudden There treasures in his little hands A fearless plain one stumbles upon nowhere. Can any heart love me as hearty and pure? Or, being born my babe, Can make me a babe, in turn, other than him? Assuaging my life’s angst, Dressing my dreamy hours And sweeping aside, with the dexterity of his hand My shattered moments of grief, Can anybody other than him Bring the light of happiness to my eyes? In his embrace lies An unending expanse of enduring maternity. Did anybody hug me like that ever before? Did anybody run his hand over my head Draining all my pangs and pains off? Did anybody dry my eyes Becoming a father and mother same time? Assigning his five years to his mom And growing to a love-incarnate From his broke-mother’s agonies, He dresses her wounds with his caressing kisses. As if he were garlanding me with his heart He runs into my hands, hugs me, Draws my head unto him, And resurrects me from agonies time and again. . Why not? There are stately steps of assured peace in his hug Enough to crown me for a thousand lives. . Telugu Original : K. Geeta . వాడి కౌగిలి . వాడి కౌగిట్లో ప్రాపంచిక బాధల్ని మైమరపించే పసి వింజామరలుంటాయి షట్దుర్బుధ్ధులన్నీ అణిగిపోయి నిశ్చింత మాత్రమే అనుభూతి పర్చుకుంటుంది ఎన్నోసార్లు నా పగిలిన దుఃఖాలన్నీ ఆ చిన్నిమెడవంపునే ప్రవహించాయి లేత ఎముకలుగుచ్చుకునే ఆ సన్నని ఎదమంచంపైనే నా చెంపల వ్యధలన్నీ తేరుకున్నది ఏమీలేని ప్రపంచంలో హఠాత్తుగా ఒక రోదనలేని ప్రత్యక్షప్రదేశం లభ్యమైనట్లు ఇంకెక్కడాలేని నిర్భయపు స్థలం ఆ చిట్టిచేతుల్లోనే నిక్షిప్తమైవుంది మనసంటూవుండినా ఇంత స్వఛ్ఛం గాప్రేమిస్తారా నన్నెవరైనా నానించి జన్మించి తిరిగి నన్ను పాపాయిని చేస్తారా ఎవరైనా- వీడు తప్ప నా జీవనపరితాపాల్ని తొలగించి నా స్వాప్నిక కాలాన్ని పరిశుభ్రంచేసి నా దుఃఖిత భయవిహ్వల సమయాన్ని చేత్తో తీసిపారేసి నా కళ్ళని ఆనందాల్తో మెరిపిస్తారా వీడుతప్ప వాడి కౌగిట్లో విసుగులేని మాతృత్వం విస్తృతమై వుంటుంది నన్నెవరైనా ఇలా హత్తుకున్నారా ఎప్పుడైనా? వ్యధావేదనలు చెదిరిపోయేలా తలనిమిరారా ఎవరైనా? అమ్మా, నాన్నలు ఒకళ్ళే అయి నా కళ్ళుతుడిచారా? అయిదేళ్ళ బాల్యాన్ని వాడు అమ్మకు ఆపాదించి విరిగిపోయిన తల్లి ఆవేదనల్నించి ఎదిగిన ప్రేమ మూర్తిలా వాడు లేత చుంబనాల్తో బాధల్ని ప్రక్షాళిస్తాడు వాడి మనసంతా తీసి నా మెళ్ళో వేళ్ళాడదీసినట్లు నాచేతుల్లోకెక్కి నన్ను కావలించుకుని నా తలని తనకానించుకుని తిరిగితిరిగి నన్ను కష్టాల్నించి పునర్జీవింపచేస్తాడు అవును మరి, వాడికౌగిట్లో వెయ్యి జీవితాలకు సరిపడా నిశ్చింత సోపానాలున్నాయి. . కె. గీత ( ద్రవభాష కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలుఆగస్ట్ 1, 2011