నెల: ఆగస్ట్ 2011
-
ఒంటరి కోతగత్తె … వర్డ్స్ వర్త్
Image Courtesy: https://s3.amazonaws.com . చూడుడామెను, ఒక్కతె… పొలమునందు ఎదర కనిపించు ఒంటరి మిట్టవాసి, కోతకోయుచు తనుదానె పాటపాడు, నిలుడు! లేకున్న మిన్నక సాగిపొండు. ఒంటరిగ చేను కోయుచు, పనల గట్టు, ఆమె గీతిక ఆపాతవిషాదభరము, వినుడు! మార్మ్రోగె లోయ ప్రతిరవముతో. . అరబుదేశపు ఇసుక ఎడారులంట, సేదదీరెడు బాటసారుల విహారములయందు, వారి శ్రమదోవ ఇంత కమ్మని రవమ్ము, మచ్చుకొక చకోరమైన వినిపించలేదు ఇంత తియ్యని స్వరము వినిపించలేదు కోకిలలుగూడ మును వసంతాగమనవేళ, దూరతీరాల ద్వీప సమూహమందు,…
-
Butterflies… vimala, Telugu, Indian
. Whenever I forget dreaming about, A Butterfly comes and rests on my eyelids with compassion, And gifts me With a dream and a smidgen of poetry. . When I walk away becoming an ascetic And a Sufi mendicant at the Vaitarini*, Leaving behind the Sarangi of Faith and the Flag of moonbeams A butterfly…
-
క్షణికం … కరీన పెరుస్సి పోర్చుగీసు కవి
. (మిత్రులందరికీ నా బ్లాగు ఒకసంవత్సరంపూర్తిచేసిన సందర్భంగా కృతజ్ఞతలూ, శుభాకాంక్షలూ. ఈ ఏడాదిలో సుమారు వంద దాకా అనువాదాలు అందించగలిగాను. అయితే యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో చదువునిమిత్తం వెళ్ళి స్ప్రింగ్ సెమెష్టర్ పూర్తిచేసే వరకూ అనువాదాలురచురించలేకపోయాను. అరోగ్యకారణాలవల్ల వెనకకి తిరిగివచ్చినా, ఆ అనుభవం ఇంకా ప్రేరణనిచ్చింది. ఈ ఏడాదిలో ఎంతమందోమంచి మిత్రుల్ని సంపాదించగలిగేను.అది చాలా సంతృప్తినిస్తుంది. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ కవుల అనువాదాలు కొనసాగిస్తాననీ, ఇంతకు ముందులాగే సామాజిక బాధ్యత కొనసాగిస్తూ నా బ్లాగులో…
-
వెలితి … వర్డ్స్ వర్త్
. ఆకస్మాత్తుగా కలిగిన ఈ సంతోషానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ, గాలికన్నా కుదురు లేకుండా, ఈ ఆనందకరమయిన విషయం పంచుకుందామని పరిగెత్తుకుని వచ్చాను. ఓహ్! ఇంకెవరు? అదిగో అగాధ నీరవ సమాధిలో… ఏ మార్పుకీ చిక్కకుండా ఉన్న నీ దగ్గరకే. ప్రేమ, చెక్కుచెదరని ప్రేమ అనగానే నువ్వు మనసులో మెదుల్తావు. అసలు నిన్నెలా మరిచిపోగలనని? కానీ ఒక లిప్తలో వెయ్యోవంతుసేపు జీవితం లొ నాకు కలిగిన ఈ తట్టుకొలేని నష్టాన్ని నేను ఏమరిచేలా ఏ శక్తి పనిచేసిందో మరి?…
-
ప్రేమను గ్రహించడం సులువే … ఫెర్నాండో పెసో
. మాటలు మార్చడం సులువే, మౌనాన్ని అనువదించడమే కష్టం. . పక్క పక్కన నడవడం తేలికే, కష్టమల్లా అటువంటి తోడు సంపాదించడమే. . అతని ముఖం చుంబించడం సులువే, హృదయానికి చేరువవడమే కష్టం, . చెయ్యీ చెయ్యీ కలపడం తేలికే, కష్టమల్లా ఆ రాపిడిలోని కవోష్ణాన్ని నిలుపు కోవడమే, . ప్రేమను గ్రహించడం సులువే, ఆ వరదని నిగ్రహించడమే కష్టం. . ఫెర్నాండో పెసో . It Is Easy To Feel The Love. .…
-
తరచు అపవిత్రమయే మాట — షెల్లీ
Image Courtesy: http://www.google.com/imgres?q=inter-stellar+space . తరచు అపవిత్రతతకు గురయే మాటని నేను మరోసారి అపవిత్రం చేస్తాను… . ఎప్పుడూ అబధ్ధమని తృణీకరించే ఒక భావనని నువ్వు మరోసారి తృణీకరిస్తావు… . నిరాశను పోలిన ఒక ఆశను, వివేకం అణచి ఉంచుతుంది … . ఎవరో చూపించే జాలికన్న, నువ్వుచూపే జాలి ఎంతో ప్రియమైనదవుతుంది … . నువ్వు అంగీకరించినా, లేకున్నా, నేనివ్వగలిగేది పురుషులు “ప్రేమ” అని పిలిచేదాన్ని కాదు… మనసును మహోన్నతం చేసేదీ, భగవంతుడుకూడా నిరాదరించలేని ఒక …
-
ల్యూసీ గ్రే … విలియం వర్డ్స్ వర్త్
(గమనిక: ఈ కవిత 1799లో ప్రచురింపబడి, ఆంగ్ల సాహిత్యాన్నేగాక విశ్వసాహిత్యాన్ని కూడా ఒక మలుపు తిప్పిన “లిరికల్ బాలెడ్స్” లోని ఒక ప్రముఖ కవిత. ప్రజల భాషలో ప్రజలదగ్గరికి కవిత్వీకరించకుండా కవిత్వాన్ని తీసుకురావాలనే వర్డ్స్ వర్త్, కాలరిడ్జ్ ల తీర్మానానికి కట్టుబడి వ్రాసినది.) . తరచు నేను ల్యూసీ గురించి వినడమే కాదు ఆడవి బాట పట్టినప్పుడు తూరుపు తెలవారే వేళకి ఒకోసారి ఒంటరిగా నాకు తారసపడేది కూడా. . పాపం! స్నేహితులూ, సావసగాళ్ళూ తెలీదు ల్యూసీకి…
-
A Rainbow — Aduri Satyavathi Devi
Courtesy: Parimi Jyothi . He is a magician of smiles. Smiles so intoxicatingly sweet As if he were an essence of Aurum and Moonshine Milk and China Rose Honey and Grape juice… . He turns all people at home around him in merry-go-round. Waving the magic-wand of childy jargon He rains fragrances of pleasures…
-
Oh This, afterall!… Aduri Satyavathi Devi
Image Courtesy: http://t1.gstatic.com . I fancy I know you But before I could confirm it The context you created changes. While I would be debating myself The way to comprehend you You recede into oblivion in ringlets. Just watching you and bewildering I liken your receding to the flow of a river But, it is…
-
జెండా అంటే ఏదో భూభాగం కాదు — NS మూర్తి.
Courtesy: Getty Images . జెండా అంటే వర్ణమాలలోని ఏవో కొన్ని రంగుల కలగలుపుతో ప్రకృతినుండో, మనిషి తయారుచేసినవో కొన్ని చిత్రాలను అద్ది నేతల అధికార, దర్పాల ప్రదర్శనకో, అధికారుల చిత్తశుధ్ధిలేని ఉద్యోగధర్మానికో ఏడాదికోమారో, రెండుసార్లో ఎగరెయ్యడానికి తయారుచేసిన గుడ్డపీలిక కాదు. అది ఒక జాతి చైతన్య స్రవంతికీ, ఆలోచనా విధానానికి ప్రతీక ఆకాశంలో కనిపించే రెపరెపలు దాని త్యాగశీలతయొక్క ఉత్తుంగతరంగాలు. కొన్నిశతాబ్దాల బానిసత్వపు చీకటిలో కలగన్న వెలుగు స్వప్నాల సాకార స్వరూపం దాని గలగలధ్వనిలో, జాగ్రత్తగా…