అనువాదలహరి

ఒక పోలిక – విలియం కూపర్

http://cdn.bleacherreport.net

.

కాలప్రవాహమూ, నదీ ప్రవాహమూ ఒక్కలాటివే.

రెండూ ఆశ్రాంతమూ విశ్రాంతి లేకుండా సాగుతాయి…

అవి గుట్టుచప్పుడుకాకుండా జారే తీరు

సంపదలు కొనలేనివీ, ప్రార్థనలు నిలువరించలేనివీ.

ఒకసారి ముందడుగువేస్తే, రెంటికీ వెనకడుగులేదు

రెండింటినీ కడకి అనంతాబ్ధి తనలో విలీనం చేసుకుంటుంది.

అయితే, ఒకదాని నొకటి అన్నిటా సరిపోలినప్పటికీ,

ఆలోచనామగ్నమైన మనసుకి, వాటి మధ్యగల తేడా చివరికి అవగతమౌతుంది…

సెలయేరెన్నడూ నిష్ప్రయోజనంగా ప్రవహించదు;

ఎక్కడ నీరు కళకళలాడుతుంటుందో

అక్కడ నేల ఫలవంతమై సమృధ్ధితో  హసిస్తుంది…

కానీ, మేధస్సును సారవంతము చెయ్యవలసిన కాలము

ఒకసారి విస్మరిస్తే,  సువిశాల ఏకాంత మరుభూముల్ని తనవెనుక మిగిల్చిపోతుంది.

.

ఆంగ్లమూలం :  ” ఒక పోలిక”   విలియం కూపర్ .

.

A Comparison

.

The lapse of time and rivers is the same,
Both speed their journey with a restless stream;
The silent pace, with which they steal away,
No wealth can bribe, no prayers persuade to stay;
Alike irrevocable both when past,
And a wide ocean swallows both at last.
Though each resemble each in every part,
A difference strikes at length the musing heart;
Streams never flow in vain; where streams abound,
How laughs the land with various plenty crown’d!
But time, that should enrich the nobler mind,
Neglected, leaves a dreary waste behind.

William Cowper

%d bloggers like this: