రోజు: జూలై 30, 2011
-
అస్రువూ- చిరునవ్వూ — ఖలీల్ జీబ్రాన్
(Photo Courtesy: http://t1.gstatic.com) . నా మనసులోని బాధల్ని జనబాహుళ్యపు ఆనందోత్సాహాలతో వినిమయం చేయ నిచ్చగించను . నా మేని అణువణువునుండీ విషాదం చిందించే కన్నీటిని చిరునవ్వుగా మరలనీను. . నా జీవితం ఒక అస్రువుగానూ, ఒక చిరునవ్వుగానూ మిగిలిపోవాలని కోరుకుంటాను. . ఒక కన్నీటి బిందువు… నా మనసు ప్రక్షాళనం చేసి జీవిత రహస్యాలూ, గహనమైన విషయాలూ అవగాహన కలిగించడానికి. ఒక చిరునవ్వు… ననుబోలిన సహోదరుల సరసన నను జేర్చి నా దైవస్తుతికి సంకేతంగా…