అనువాదలహరి

A Foundling – Aduri Satyvati Devi

Courtesy: http://www.realcourage.org

.

A screaming unwanted child when he was born

An offshoot of municipal rag-ring

A penalty paid by some innocence

For a trespass or somebody’s necessity….

The strains of blood on him

Won’t give out his parentage.

When our delicate etiquette had turned their backs

Throwing blankets of silence on his first cries,

As though ‘compassion’ had walked down…

Motherhood was still alive…

A pair of old hands from the street-end hut

Cuddled that dirty baby

Resurrecting humaneness

And fostered him with love.

When on one stormy day

 The curtain was downed

On an already tattered old life

The lone destitute, to the entire street,

Had become a sweetmeat

That we smacked our lips at.

Giving him the ‘leftover’s of our food,

Worn-out clothing, gratis

His childhood

We have been seasoning our lives with.

With out him, our days won’t take-off

Be it for marketing or

For leaving children at school.

Our polished shoes and creased clothing

Shine under the charity of his labor.

Whenever he meets me square in the eyes…smiling…

With a sense of guilt

I shrink to a mustard seed.

.

A. Satyavati Devi.

.

గాలిమొక్క

వాడు పుట్టినప్పుడు ఎవరికీ అక్కర్లేని ఆర్త శిశువు

మునిసిపాలిటీ చెత్తకుండీలోం చి మొలిచిన ఆనాధమొగ్గ

ఎవరి అవసరానికో ఏ అమాయకత్వానికో ఎరయై

సరిహద్దులు దాటి వచ్చిన అపరాథరుసుం

వయసుకమ్ముకున్న ఉద్రేకాల వం చనాశిల్పం

వాడివొళ్ళంతా అంటిన ఎర్రని రక్తపుమరకలు

ఏ చిరునామాలూ చెప్పవు.

.

మా నాజూకు సంస్కారాలు వాడి తొలిఆక్రందనలపై

మౌనం దుప్పట్లు కప్పి ముఖాలు వెనక్కు తిప్పుకున్నప్పుడు

వీధిచివర పాకలోం చి కారుణ్యం నడిచొచ్చినట్లు

తల్లిదనం ఇంకాబ్రతికున్నట్లు

ఒక ముదుసలి హస్తాలు ఆప్యాయంగా ఆ మురికి శిశువు నాదుకొని

మనిషితనాన్ని బ్రతికించాయి- మమతతో సాకాయి.

తనబ్రతుకే తనకి దుర్భరమైన ఆ ముసలి పాత్ర

ఓ గాలివానకి ముగిసినపుడు

ఆ వొంటరి అనాధ పక్షిగాడు మా వీధికందరికీ

నోరూరిం చే మిఠాయిపొట్లం లా తయారయ్యాడు.

మా గిన్నెల్లో మిగిలిపోయినన మెతుకుల్నీ

మా ఇళ్లల్లో చినిగిపోయిన పాతల్నీ

ఉదారంగా వాడికి ఇచ్చి

వాడిబాల్యాన్ని ముక్కలుగానూ మూరలుగానూ నంజుకుతింటున్నాం.

వాడులేందే  మా ఇళ్ళల్లో ఏ పనులూ సాగవు

కూరలు తేవాలన్నా స్కూళ్ళకి పిల్లల్ని దింపాలన్నా

మా బూట్ల పాలీష్ లూ మా ఇస్త్రీ మడతలూ

వాడిశ్రమదానం అందుకుని మెరుస్తుంటాయి.

చిరునవ్వుతో వాడు ఎదురైనప్పుడల్లా

అపరాధభావం తో మనసు ఆవగింజంతైపోతుంది…

ఆదూరి సత్యవతీ దేవి

(గాలిమొక్క- రెక్కముడవని రాగం కవితా సంకలనం నుండి).

%d bloggers like this: