అనువాదలహరి

ఒక స్వప్నం – ఎడ్గార్ ఏలన్ పో

Morning Star

                                    (Image Courtesy: http://religiousreading.bestmoodle.net)

.

చీకటి రాత్రి నీలి నీడల్లో

గతించిన సుఖాన్ని కలగన్నాను

కాని, పగటి కలయైన జీవితపు వెలుగు

మనసు విరిచేసింది.

.

అసలు

కనిపించే ప్రతి వస్తువులోనూ,

గతకాలపు వెలుగులు వాసనలు వెతుక్కునేవాడికి

పగటికలకానిదేది?

.

ఆ మధురమైన కల, రసప్లావితమైన కల,

లొకం ఛీత్కరించినా, నా వెన్నుతట్టి

ఏకైక వెన్నెలకిరణమై   ప్రోత్సహించి  నడిపించింది

దూరాన్నుండే వణికించే చీకట్లలోనూ …  తుఫాన్లలోనూ …

నిజానికి,  వేగుచుక్కను మించిన

స్వఛ్ఛమైన కాంతిపుంజమేముండగలదు?

.

ఆంగ్ల మూలం:  ఎడ్గార్ ఏలన్ పో

.

A Dream – Edgar Allan Poe

.

In visions of the dark night

I have dreamed of joy departed-

But a waking dream of life and light

Hath left me broken-hearted.

Ah! what is not a dream by day

To him whose eyes are cast

On things around him with a ray

Turned back upon the past?

That holy dream- that holy dream,

While all the world were chiding,

Hath cheered me as a lovely beam

A lonely spirit guiding.

What though that light, thro’ storm and night,

So trembled from afar-

What could there be more purely bright

In Truth’s day-star?

.

2 thoughts on “ఒక స్వప్నం – ఎడ్గార్ ఏలన్ పో”

    1. మీకు అనువాదాలు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రచయిత లేదా అనువాదకునికి రసహృదయులైన పాఠకుల స్పందన కంటే మించిన ప్రతిఫలం ఏముంటుంది చెప్పండి. మీ అభిప్రాయం తెలపడానికి సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: