The Last Touch- K. Geetha My last respects to the feet visible on the funeral bed This touch is the last memory of Daddy for all his life. *** Daddy! Daddy!! Did your sins agonize? Or your telltale hand on mother’s neck torment you as wounds? Ineluctable throes Before heart rests or life ceases! How moving was your wailing unable to endure, as You substituted the voice failed three years hence, with your fingers !! Whenever tears well up for you…. Your keeping guard dozing outside the rest room Boxing my back when I did not heed your word, My sister and I playing merry-go-round with your hands, and the cracking of our bones as you removed the body-pack, once a year, for Pongal, … Are the few, little , hazy memories that flash in my memory-scape. Whenever mother’s eyes filled with tears I felt like burning you with petrol But strangely, yesterday, I wished you were rather alive. Forsaking your duties Living only for yourself What did you achieve? Extreme pleasure… And extreme grief. You became a specimen for people … how not to be And couldn’t be a coveted figure in any heart. Didn’t I tell you that you will be relieved and everything would be alright? Being aware that death is the only cure for you, I told you to buck up and not to worry. How can I forget, when can I forget Those eyelids eagerly searching for me in the last hour? Your pangs entreating to hold your hand? You were a devil that put my mother to every hardship. You were a father who no one would ever like, But Yet, I felt a part of me had burnt to ashes. When brother called ‘Daddy!’ into your corporal ear I had an urge to shake you up and take you back home. As the filing logs concealed your hands and bosom I felt like crying you can’t bear that burden. When I mercilessly awaited your skull to incinerate in the raging pyre, The grief piled up to heart’s brim, had ultimately burst out. . చివరి స్పర్శ . పేర్చిన చితిలో కన్పడే కాళ్ళకు ఆఖరి నమస్కారం జీవితం మొత్తమ్మీద డాడీ గుర్తుగా చివరి స్పర్శ జ్ఞాపకం పాపాలు పీడించాయా అమ్మ మెడమీద నీ చేతి గాట్లే గాయాలై వేధించాయా గుండె ఆగడాన్కి జీవి మరణించడాన్కి తప్పని పెనువేదన- మూడేళ్ళకిందటే మూగదైన గొంతుని చేతివేళ్లలో నింపి ఎంతగా రొదించావో తట్టుకోలేకపోతున్నానని నీకోసం కళ్ళు నిండినప్పుడల్లా చిన్నప్పుడెప్పుడో రాత్రుళ్ళు నా కోసం మరుగుదొడ్డిబయట కునికిపాట్లు పడడం చెప్పినమాట వినకపోతే నీ వీపుమీద బాక్సింగ్ చేయడం చెల్లీ, నేనూ నీ భుజాల్ని పట్టుకుని రంగుల రాట్నం తిరగడం ఏడాదికోసారి భోగినలుగుల్లో మా ఎముకలు నలగడం ఒకటొ -అరగా- మిగిలిన చిందే చిన్ని జ్ఞాపకాలు అమ్మ కళ్ళు నిండినప్పుడల్లా పెట్రోలేసి నిన్ను తగలెయ్యాలన్పించేది నిన్న- ఎందుకో బతికితే బావుణ్ణనిపించింది బాధ్యతలు విస్మరించి నీ కోసం నువ్వు జీవించి నువ్వు పొందిందేమిటి? అత్యంత ఆనందం- అత్యంత విషాదం- నిన్ను చూసినవాళ్ళకో గుణపాఠం గా మిగిలేవు కానీ ఏ ఒక్క గుండెలోనూ చిత్రపటం కాలేకపోయావు డేడీ! డేడీ! నే చెప్పానుకదా- అన్నీ తగ్గిపోయి మళ్ళీబాగైపోతుందని మరణమే నీశరీరానికి మందని తెల్సీ నే చెప్పాను కదా- ఏమీ కాదు ధైర్యంగా వుండమని చివరి గంటల్లో నాకోసం కొట్టుకున్న నీ కనుగుడ్లు చెయ్యి పట్టుకోమని వ్యధపడ్డ నీ అవస్థలు ఎలా మర్చిపోను? ఎప్పటికి మర్చిపోను?? నువ్వు నాకు వద్దనిపించే నాన్నవి అమ్మని కష్టపెట్టిన రాక్షసుడివి అయినా నా శరీరం లో భాగం కాలి బూడిదైనట్లయింది పార్థివ కర్ణం లో అన్నయ్య ‘డేడీ!” అని పిల్చినప్పుడు నిన్నుపట్టి కుదిపి వెనక్కి తీసుకెళ్ళిపోవాలన్పించింది పేర్చే కట్టెలు నీ చేతుల్నీ, గుండెనీ మూస్తున్నప్పుడు అంతబరువు ఆనుకోలేవని అరవాలంపించింది నిర్దాక్షిణ్యంగా నిప్పుల్లో నీ కపాలమోక్షం కోసం ఎదురుచూసినపుడు నా హృదయం చివర గాఢంగా వేలాడుతున్న దుఃఖం పెటేలున పగిలింది. జనవరి 2, 2006 కె. గీత ( శీతసుమాలు కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 3 వ్యాఖ్యలుజూలై 22, 2011