Siva Reddy 59 59 . It’s difficult to stand up. . You don’t realize… When you live giving a damn you don’t realize… But it’s hard to stand up. Enduring everything yet, remaining unshattered is exacting. It’s easy to crack and collapse shattered And easier to scatter like bewildered looks. . What it takes, after all, to blow out? It’s hard to inflame like a faggot. But then, how difficult is to burn! Donning flame like attire and Walking swinging hands like branches Upon hills, across oceans, Among valleys, along meadows Above abysses, over summit tops How arduous it is to walk with ease Wearing a peacock’s plume in the crown Floating above the ground. . It would be pleasing to the onlookers Even amusing and entertaining. But, only the walker can feel . The scorching under the feet . The boils rending within . Vortices and volcanoes . Moistening eyes and melting colors He would hole them out between folds of the pages We can’t get a clue . We will be looking at his eyes and his feet . Standing upright with grit and gumption . He walks away, Looking conquered or to conquer the world. . And in his wakes A few cyclones and a few rainbows. . K. Siva Reddy . . 59 నిలబడ్డం చాలా కష్టం. . తెలియదుగానీ, నాకేం లెమ్మని తిరిగేటప్పుడు తెలియదు గానీ, నిలబడటం చాలా కష్టం. అన్నింటినీ తట్టుకుని విరిగిపోకుండా నిలబడటం చాలా కష్టం. విరిగిపోవడం చాలా సులువు. విఛ్ఛిన్నమై పడిపోవటం . బేలచూపుల్లా చెల్లాచెదరైపోవటం చాలా సులువు. . ఆరిపోవటం ఎంతసేపు? మండటమే కష్టం- అలా కాష్టం లా అయినా సరే కాలటం ఎంత కష్టం మంటని దుస్తుల్లా ధరించి కొమ్మల్లాచేతులూపుకుంటూ నడవటం కొండలమీదా, సాగరాలమీదా లోయల మీదా, మైదానాలమీదా అగాధాలమీదా, ఉన్నత శిఖరాలమీదా నెత్తిమీద ఒక నెమలికన్ను ధరించి అలా అలవోకగా, కాళ్ళు ఆననట్టు . నడిచిపోవటం ఎంత కష్టం? . చూసేవాళ్ళకి హాయిగా ఉంటుంది. ఆనందంగానూ, వినోదం గానూ ఉంటుంది. కానీ, నడిచేవాడికే తెలుస్తుంది . అరికాళ్ళకింద మంటలు . గర్భంలో విచ్చుకుంటున్న బొబ్బలు . సుడిగుండాలూ, అగ్నిపర్వతాలూ, . చెమరించే కన్నులూ, చెదిరిపోయే రంగులు- అన్నిటినీ వాడు పేజీ మడతల్లో దాచేస్తాడు మనకి క్లూ దొరకదు, . వాడికళ్ళకేసీ, కాళ్ళకేసీ చూస్తుంటాం . అతడలానే నిటారుగా నిలబడి ధీమాగా, ధైర్యంగా . ప్రపంచాన్ని జయించినట్టు జయించడానికన్నట్టు అలా నడుచుకుంటూ వెడుతుంటాడు . వాడి వెనకమాల . కొన్ని తుఫానులూ, కొన్ని ఇంద్ర ధనుస్సులూ- . . . కె. శివా రెడ్డి (అంతర్జనం) 4.4.2002 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిజూలై 12, 2011