Siva Reddy 62 62 . “Are sons Capital?” Asked a son of his father. Nonplussed at the sudden question, unable to find an answer, the father murmured within “what are parents then?” . Why do you expect everything to happen the way you want And everybody to grow the way you desire? When everything is social, and is defined by context Answers won’t be as easy as the questions. It’s very difficult to separate a strand unsnapped from a tangled spool of thread. . True I admit economic root of every relation- But then, can we define them all in economic jargon? . No. Human relations are not that easy as to be amenable to economic lingo. . Trying to define recondite responses and reactions would be like pulling out a tree from earth and trying to ‘bonsai’ it in a glass of water. . As you said, if one were to use the economic argot Parents ARE Capital And children grow on it like interest. . Children won’t remain children They too become parents. . . K. Siva Reddy . . 62 “కొడుకులేమైనా కాపిటలా” అని అడిగాడొక కొడుకు తండ్రిని. ఊహించని ప్రశ్నకి తండ్రి తలక్రిందులై సమాధానం దొరక్క గొణుక్కున్నాడు “మరి తలిదండ్రులేమిటని” ఎందుకనుకుంటావు ప్రతీదీ నువ్వనుకున్నటుగానే జరగాలనీ ప్రతివాడూ నువ్వనుకున్నట్టే ఎదగాలనీ. ప్రతీదీ సామాజికమయినప్పుడు ప్రతిదాన్నీ సందర్భం నిర్ణయిస్తున్నప్పుడు ప్రశ్నలంత తేలిగ్గా సమాధానాలుండవు చిక్కుపడిన దారపుండలోంచి తెగకుండా ఒక దారప్పోగు లాగటం చాలా కష్టం- నిజమే ప్రతిదాని ఆర్థిక మూలాల్ని ఒప్పుకుంటాను- అయితే సంబంధాలని ఆర్థిక పరిభాషలో నిర్వచించగలమా లేదు, ఆర్థికపరిభాషకొదిగేంత సులువయినవేమీ కాదు సంబంధాలు ఒక నిగూఢ సంస్పందనల్నీ, చర్యాప్రతిచర్యల్నీ నిర్వచించటం, భూమిలోంచి చెట్టునుపీకి నీళ్ళునింపిన సీసాలో పెట్టినట్టు నువ్వన్నట్టు ఆర్థిక పరిభాషలో మాట్లాడితే తలిదండ్రులే మూలధనం దానిమీద వడ్డీలా పెరుగుతారు పిల్లలు పిల్లలు పిల్లల్లా వుండరు వాళ్ళూ తల్లిదండ్రులవుతారు- . . కె. శివారెడ్డి (అంతర్జనం) 19.4.2002 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిజూలై 11, 2011