అనువాదలహరి

కె. శివారెడ్డి 66

What else than ruin can you expect

Amongst people falling into ruins?

Good grief! There won’t even be intense grief .

People won’t turn barren should they encounter grief.

What do they hook up to, to swing to and fro?

Of what use are the trails when

They lead to barrens and thorny bushes?

True. You gave me a sling to go begging.

Don’t you think I should have

A shoulder to hang it on?

These are shoulderless, waterless delectables.

No doubt, it is wrong to beg.

There won’t be any edicts for begging.

But one has to contend with desert-like seas.

Let’s not blame anybody. 

Strangely, the toys they so carefully preserved since childhood,  

have grown to mountainous proportions

and are now smashing on them to smithereens.

Where can they run off

who lost their limbs in childhood?

This is all a petrified world.

Want, want, want… want of spring.   

.

.

66
శిథిలమవుతున్న మనుషుల మధ్య
ఏముంటుంది శిథిలత్వం తప్ప.
       బలమయిన దుఃఖం కూడా ఉండదు.
       దుఃఖముంటే మనుషులు ఎండిపోరు-
దేనినుండి దేనికి తాడుగట్టి ఊగుతారు
ముళ్ళకంచెల్లోకి, సవిటిపర్రల్లోకి
       దారిచూపే అడుగుజాడలెందుకు?
నాకు జోలిచ్చావు. నిజమే
దాన్ని తగిలించుకోవడానికి
       నాకో బుజముండాలికదా
       బుజాల్లేని, నీళ్ళులేని నేత్రపర్వాలివి.

       అడగటం తప్పే
       అడిగినందుకు శిక్షలేమీ ఉండవు కానీ
       ఎడారిలాంటి సముద్రాలు ఎదురవుతాయి
మనం ఎవరినీ ఏమీ అనొద్దు
వాళ్ళుచిన్నప్పుడుదాచుకున్న
ఆటబొమ్మలన్నీ విచిత్రంగా మహాపర్వతాల్లా
ఎదిగి, ఇప్పుడువిరిగి పడుతున్నాయి వాళ్ళమీద;

      ఎక్కడికని పరిగెడతారు
      బాల్యం లోనేకాళ్ళూచేతులూపోగొట్టుకున్నవాళ్ళు
అంతా రాతి ప్రపంచం
రాహిత్యం,రాహిత్యం, రాహిత్యం జలరాహిత్యం.

(కె. శివారెడ్డి అంతర్జనం నుండి)

%d bloggers like this: