అనువాదలహరి

Sivreddy

But not everything silent is deadHolan

.

.

There is nothing special about a half-open window.

.

For that can’t or one that won’t

The opened wing is the breath, imagination, and creativity

Taking in whatever little world

That gets caught in its net…

.

A crumb of cloud, the trail of a jet,

A little further above …the azure sky-sea,

Turning aside a little,

A branch swaying as though its beckoning

And the bustle of the birds nestling in its wings…

.

A current wire as wide as the opened window

and a dove neatening its feathers over there-

.

A wooly-pawed fair cat walks slowly

Along the common wall between two houses,

And stops midway in its walk, like semi-colon,

Raising and inspecting its fire-paw,

Makes a cursory glance at statue-like me at the window

And dismissing with a nonchalant wag of tail

walks ahead

.

A bird, a cat, a plant or a wool of cloud or a sail of steam…

They are my diction now.

.

.

“But not everything silent is dead” Holan

.

ఒక రెక్క తీఎసిన కిటికీ విశేషమయిన వస్తువేం కాదు

గదిలోం చి కదలని వాడికి, కదలలేని వాడికి

తీసిన కిటికీ ఒక ప్రాణం, ఒక కల్పన, ఒక సృజన

ఆ కాస్త కిటికీలోంచే

అందిన ప్రపంచాన్ని వలేసి తనలోకి లాక్కుంటూ-

ఒక మేఘం ముక్క, విమానం వెళ్ళిపోయాక మిగిలే పొగ జాలు

ఇంకొంచెం పైఅన నీలనీలంగా కన్పించే ఆకాశ సముద్రం

ఇంకొంచెం పక్కకి జరిగితే పిలుస్తున్నట్టు కదుల్తున్న చెట్టుకొమ్మ

కొమ్మల్లో కదుల్తున్న పిట్టల శబ్దాలు

తీసిన కిటికీ రెక్కంత విశాలంగానే కనపడుతున్న

కరెంటు తీగ, దానిపై రెక్కలు దువ్వుకుంటున్న పావురం-

రెండు ఇళ్ళమధ్య వున్న ప్రహారీగోడమీద

నిశ్శబ్దంగా ఊలుపాదాలతో నడుస్తున్న తెల్ల పిల్లి

సగం దూరం నడిచి

సెమికోలన్ లా ఆగిపోయి, ముందుపాదం ఎత్తిచూసుకుని

కిటికీలో విగ్రహంలా వున్న నన్ను చూసి

‘పోరాపో ‘ అని తోకాడించుకుంటూ ముందుకెళ్ళి-

పిట్టో, పిల్లో, చెట్టో,  మబ్బుముక్కో, ఆవిరి తెరచాపో,

ఇవీ ఇప్పటి నా భాష.

10.1.2002

తెలుగు మూలం: కె. శివారెడ్డి. (అంతర్జనం)

%d bloggers like this: