అనువాదలహరి

ఒక పోలిక – విలియం కూపర్

http://cdn.bleacherreport.net

.

కాలప్రవాహమూ, నదీ ప్రవాహమూ ఒక్కలాటివే.

రెండూ ఆశ్రాంతమూ విశ్రాంతి లేకుండా సాగుతాయి…

అవి గుట్టుచప్పుడుకాకుండా జారే తీరు

సంపదలు కొనలేనివీ, ప్రార్థనలు నిలువరించలేనివీ.

ఒకసారి ముందడుగువేస్తే, రెంటికీ వెనకడుగులేదు

రెండింటినీ కడకి అనంతాబ్ధి తనలో విలీనం చేసుకుంటుంది.

అయితే, ఒకదాని నొకటి అన్నిటా సరిపోలినప్పటికీ,

ఆలోచనామగ్నమైన మనసుకి, వాటి మధ్యగల తేడా చివరికి అవగతమౌతుంది…

సెలయేరెన్నడూ నిష్ప్రయోజనంగా ప్రవహించదు;

ఎక్కడ నీరు కళకళలాడుతుంటుందో

అక్కడ నేల ఫలవంతమై సమృధ్ధితో  హసిస్తుంది…

కానీ, మేధస్సును సారవంతము చెయ్యవలసిన కాలము

ఒకసారి విస్మరిస్తే,  సువిశాల ఏకాంత మరుభూముల్ని తనవెనుక మిగిల్చిపోతుంది.

.

ఆంగ్లమూలం :  ” ఒక పోలిక”   విలియం కూపర్ .

.

A Comparison

.

The lapse of time and rivers is the same,
Both speed their journey with a restless stream;
The silent pace, with which they steal away,
No wealth can bribe, no prayers persuade to stay;
Alike irrevocable both when past,
And a wide ocean swallows both at last.
Though each resemble each in every part,
A difference strikes at length the musing heart;
Streams never flow in vain; where streams abound,
How laughs the land with various plenty crown’d!
But time, that should enrich the nobler mind,
Neglected, leaves a dreary waste behind.

William Cowper

అస్రువూ- చిరునవ్వూ — ఖలీల్ జీబ్రాన్

                                                                  (Photo Courtesy: http://t1.gstatic.com)

.

నా మనసులోని బాధల్ని

జనబాహుళ్యపు ఆనందోత్సాహాలతో వినిమయం చేయ నిచ్చగించను
.

నా మేని అణువణువునుండీ

విషాదం చిందించే కన్నీటిని

చిరునవ్వుగా మరలనీను.

.

నా జీవితం ఒక అస్రువుగానూ, ఒక చిరునవ్వుగానూ మిగిలిపోవాలని కోరుకుంటాను.

.

ఒక కన్నీటి బిందువు…

నా మనసు ప్రక్షాళనం చేసి

జీవిత రహస్యాలూ, గహనమైన విషయాలూ

అవగాహన కలిగించడానికి.

ఒక చిరునవ్వు…

ననుబోలిన సహోదరుల సరసన నను జేర్చి

నా దైవస్తుతికి సంకేతంగా నిలవడానికి.

.

ఒక అస్రువు… గుండెపగిలిన వారితో నేను  మమేకమవడానికి

ఒక చిరునవ్వు… నా ఉనికిలోని సంతోషానికి గుర్తుగా

.

నిరాశతో, అలసి బ్రతికేకంటే…  వాంఛిస్తూ, తపిస్తూ మరణించడమే కోరుకుంటాను.

.

ప్రేమా, సౌందర్యమూ కొరకు నా క్షుధార్తి

నా చైతన్యపు అంతరాంతరాలకు వ్యాపించాలని కోరుకుంటాను….

ఎందుకంటే

వాటిపట్ల సంతృప్తి చెందినవాళ్ళు

అత్యంత దౌర్భాగ్యులుగా మిగిలిపోవడం నే చూసాను.

కాంక్షాపరితప్తులైన వారి నిట్టూర్పులను విన్నాను…

అవి మధురాతిమధురమైన స్వరమేళనం కన్నా తియ్యగా ఉన్నాయి.

.

పొద్దువాలడమే తడవు, పంకజం తన రేకలు ముకుళించుకుని

కాంక్షను హత్తుకుని నిద్రకుపక్రమిస్తుంది.

పొద్దుపొడవడమే తడవు, ప్రభాకరుని

కవోష్ణ చుంబనకై తన పెదవులు విచ్చుతుంది.

ఆ విరి జీవితము … ఒక ఆరాటమూ… ఒక అందుకోలూ

ఒక అస్రువూ— ఒక చిరునగవూ.

.

సముద్రజలాలు ఆవిరులై ఎగసి, కలిసి, మేఘాలై రూపుదిద్దుకుంటై.

మేఘం కొండలమీదా, లోయలమీదా

మంద సమీరాన్ని తాకే వరకూ విహరించి,

భోరున పొలాలపై రోదించి, వాగులూ నదులై ప్రవహించి

తన నెలవైన సాగరాన్ని చేరుకుంటుంది.

.

మేఘాల జీవితం… ఒక విధురము … ఒక కలయిక.

ఒక అస్రువూ— ఒక చిరునగవూ.
.

ఆ తీరునే, ఆత్మ తనకంటే ఉన్నతమైన పరమాత్మనుండి వేరై

ఈ ద్రవ్యప్రపంచంలో చరించి,

పారవశ్యాల మైదానాలమీదా,

విషాద నగాగ్రాలమీదా  మేఘమై సంచరించి,

మృత్యుశీకరములు సోకి,

బయలుదేరిన చోటుకే చేరుకుంటుంది.

సౌందర్యానందసింధువైన … భగవంతుడి దగ్గరకి.

.

A Tear And A Smile

.

I would not exchange the sorrows of my heart
For the joys of the multitude.
And I would not have the tears that sadness makes
To flow from my every part turn into laughter.
.
I would that my life remain a tear and a smile.
.
A tear to purify my heart and give me understanding
Of life’s secrets and hidden things.
A smile to draw me nigh to the sons of my kind and
To be a symbol of my glorification of the gods.
.
A tear to unite me with those of broken heart;
A smile to be a sign of my joy in existence.
.
I would rather that I died in yearning and longing than that I live Weary and despairing.
.
I want the hunger for love and beauty to be in the
Depths of my spirit, for I have seen those who are
Satisfied the most wretched of people.
I have heard the sigh of those in yearning and Longing, and it is sweeter than the sweetest melody.
.
With evening’s coming the flower folds her petals
And sleeps, embracing her longing.
At morning’s approach she opens her lips to meet
The sun’s kiss.
.
The life of a flower is longing and fulfillment.
A tear and a smile.
.
The waters of the sea become vapor and rise and come
Together and area cloud.
.
And the cloud floats above the hills and valleys
Until it meets the gentle breeze, then falls weeping
To the fields and joins with brooks and rivers to Return to the sea, its home.
.
The life of clouds is a parting and a meeting.
A tear and a smile.
.
And so does the spirit become separated from
The greater spirit to move in the world of matter
And pass as a cloud over the mountain of sorrow
And the plains of joy to meet the breeze of death
And return whence it came.
.
To the ocean of Love and Beauty—-to God

.

(From English Original:  A Tear  And A Smile: Khalil Gibran)

కలలో కల – ఎడ్గార్ ఏలన్ పో

Image Courtesy: http://www.google.com/imgres?q=beach+sands+in+fist&hl=en&biw=1200&bih=613&gbv=2&tbm=isch&tbnid=5CMThoVyvkLNlM:&imgrefurl=http://jiangxidreaming.blogspot.com/&docid=Zj5afB6oWCd7zM&w=1600&h=1200&ei=Nb0xTurVHsbQrQfDh_XLCw&zoom=1&chk=sbg&iact=hc&vpx=889&vpy=167&dur=6647&hovh=194&hovw=259&tx=114&ty=103&page=19&tbnh=134&tbnw=179&start=288&ndsp=16&ved=1t:429,r:15,s:288

(Image Courtesy: http://2.bp.blogspot.com

.

నీ కనుబొమ మీద నను చుంబించనీ!

నీ నుండి ఎడమయే  ఈ తరుణంలో

ఇది మాత్రం నిశ్చయంగా చెప్పగలను.

నా ఈ రోజులన్నీ ఒక కలగా నువ్వు ఎంచినది అబధ్ధం కాదు;

అయినప్పటికీ,

ఒక రాత్రిలోనో, పగటిపూటో, ఒక స్వప్నం లోనో, ఏమీ లేకుండానో

ఆశలెగిరిపోయినంత మాత్రాన,  ఎగిరిపోవడం మిధ్యా?

మనం చూసేదీ, చూసినట్టగుపించేదీ అంతా ఒక కలలో కల.

.

నేను ఫేనామృదంగతరంగాఘాత తీరంలో నిలుచున్నాను.

నా పిడికిలిలో స్వర్ణరేణువుల ఇసుక.

అవనగా ఎన్ని?

అయినా అవి నే శోకిస్తుండగానే

నా వ్రేళ్ళ సందులలోనుండి క్రిందకి ఎలా జారిపోతున్నాయో!

.

ఓ భగవంతుడా! నేను వాటిని గట్టిగా బంధించలేనా?

ఓ దైవమా! ఒక్క రేణువునైనా

నిర్దాక్షిణ్యమైన కెరటపు బారినుండి రక్షించలేనా?

మనం చూచేదీ, చూసినట్టగుపించేదీ అంతా కలేనా?
.

ఎడ్గార్ ఏలన్ పో

.

A Dream Within Dream

Take this kiss upon the brow!
And, in parting from you now,
Thus much let me avow-
You are not wrong, who deem
That my days have been a dream;
Yet if hope has flown away
In a night, or in a day,
In a vision, or in none,
Is it therefore the less gone?
All that we see or seem
Is but a dream within a dream.

I stand amid the roar
Of a surf-tormented shore,
And I hold within my hand
Grains of the golden sand-
How few! yet how they creep
Through my fingers to the deep,
While I weep- while I weep!
O God! can I not grasp
Them with a tighter clasp?
O God! can I not save
One from the pitiless wave?
Is all that we see or seem
But a dream within a dream?

.Edgar Allan Poe

A Foundling – Aduri Satyvati Devi

Courtesy: http://www.realcourage.org

.

A screaming unwanted child when he was born

An offshoot of municipal rag-ring

A penalty paid by some innocence

For a trespass or somebody’s necessity….

The strains of blood on him

Won’t give out his parentage.

When our delicate etiquette had turned their backs

Throwing blankets of silence on his first cries,

As though ‘compassion’ had walked down…

Motherhood was still alive…

A pair of old hands from the street-end hut

Cuddled that dirty baby

Resurrecting humaneness

And fostered him with love.

When on one stormy day

 The curtain was downed

On an already tattered old life

The lone destitute, to the entire street,

Had become a sweetmeat

That we smacked our lips at.

Giving him the ‘leftover’s of our food,

Worn-out clothing, gratis

His childhood

We have been seasoning our lives with.

With out him, our days won’t take-off

Be it for marketing or

For leaving children at school.

Our polished shoes and creased clothing

Shine under the charity of his labor.

Whenever he meets me square in the eyes…smiling…

With a sense of guilt

I shrink to a mustard seed.

.

A. Satyavati Devi.

.

గాలిమొక్క

వాడు పుట్టినప్పుడు ఎవరికీ అక్కర్లేని ఆర్త శిశువు

మునిసిపాలిటీ చెత్తకుండీలోం చి మొలిచిన ఆనాధమొగ్గ

ఎవరి అవసరానికో ఏ అమాయకత్వానికో ఎరయై

సరిహద్దులు దాటి వచ్చిన అపరాథరుసుం

వయసుకమ్ముకున్న ఉద్రేకాల వం చనాశిల్పం

వాడివొళ్ళంతా అంటిన ఎర్రని రక్తపుమరకలు

ఏ చిరునామాలూ చెప్పవు.

.

మా నాజూకు సంస్కారాలు వాడి తొలిఆక్రందనలపై

మౌనం దుప్పట్లు కప్పి ముఖాలు వెనక్కు తిప్పుకున్నప్పుడు

వీధిచివర పాకలోం చి కారుణ్యం నడిచొచ్చినట్లు

తల్లిదనం ఇంకాబ్రతికున్నట్లు

ఒక ముదుసలి హస్తాలు ఆప్యాయంగా ఆ మురికి శిశువు నాదుకొని

మనిషితనాన్ని బ్రతికించాయి- మమతతో సాకాయి.

తనబ్రతుకే తనకి దుర్భరమైన ఆ ముసలి పాత్ర

ఓ గాలివానకి ముగిసినపుడు

ఆ వొంటరి అనాధ పక్షిగాడు మా వీధికందరికీ

నోరూరిం చే మిఠాయిపొట్లం లా తయారయ్యాడు.

మా గిన్నెల్లో మిగిలిపోయినన మెతుకుల్నీ

మా ఇళ్లల్లో చినిగిపోయిన పాతల్నీ

ఉదారంగా వాడికి ఇచ్చి

వాడిబాల్యాన్ని ముక్కలుగానూ మూరలుగానూ నంజుకుతింటున్నాం.

వాడులేందే  మా ఇళ్ళల్లో ఏ పనులూ సాగవు

కూరలు తేవాలన్నా స్కూళ్ళకి పిల్లల్ని దింపాలన్నా

మా బూట్ల పాలీష్ లూ మా ఇస్త్రీ మడతలూ

వాడిశ్రమదానం అందుకుని మెరుస్తుంటాయి.

చిరునవ్వుతో వాడు ఎదురైనప్పుడల్లా

అపరాధభావం తో మనసు ఆవగింజంతైపోతుంది…

ఆదూరి సత్యవతీ దేవి

(గాలిమొక్క- రెక్కముడవని రాగం కవితా సంకలనం నుండి).

ఒక స్వప్నం – ఎడ్గార్ ఏలన్ పో

Morning Star

                                    (Image Courtesy: http://religiousreading.bestmoodle.net)

.

చీకటి రాత్రి నీలి నీడల్లో

గతించిన సుఖాన్ని కలగన్నాను

కాని, పగటి కలయైన జీవితపు వెలుగు

మనసు విరిచేసింది.

.

అసలు

కనిపించే ప్రతి వస్తువులోనూ,

గతకాలపు వెలుగులు వాసనలు వెతుక్కునేవాడికి

పగటికలకానిదేది?

.

ఆ మధురమైన కల, రసప్లావితమైన కల,

లొకం ఛీత్కరించినా, నా వెన్నుతట్టి

ఏకైక వెన్నెలకిరణమై   ప్రోత్సహించి  నడిపించింది

దూరాన్నుండే వణికించే చీకట్లలోనూ …  తుఫాన్లలోనూ …

నిజానికి,  వేగుచుక్కను మించిన

స్వఛ్ఛమైన కాంతిపుంజమేముండగలదు?

.

ఆంగ్ల మూలం:  ఎడ్గార్ ఏలన్ పో

.

A Dream – Edgar Allan Poe

.

In visions of the dark night

I have dreamed of joy departed-

But a waking dream of life and light

Hath left me broken-hearted.

Ah! what is not a dream by day

To him whose eyes are cast

On things around him with a ray

Turned back upon the past?

That holy dream- that holy dream,

While all the world were chiding,

Hath cheered me as a lovely beam

A lonely spirit guiding.

What though that light, thro’ storm and night,

So trembled from afar-

What could there be more purely bright

In Truth’s day-star?

.

Rendering A Song Of A Cataract

http://mrstorydigiphoto.blogspot.com/2010_10_01_archive.html

                                              (Photo Courtesy: http://mrstorydigiphoto.blogspot.com)

I Know

When I start piling up words…

I lose my being and identity;

Float Like a cloud drifting with the wind.

Yet, I show off my ego and standing.

.

I know

When the other man embraces silence,

He has bottled up the fires of frustration,

Insults and the swelling oceanic emotions;

And carries the burden of life

Patiently with great endurance

Ready to sprout in compassion.

.

The amphibious me,

Living like a frog in a well,

Climbs  step by step up

Gathering each one of you around.

Thawing his silence by degrees,

He gets sharp

Aiming life at bulls eye

Of the window of ambitions.

Transforming his looks into sun rays,

He fashions his thoughts incessantly to fruition.

He who crawled at my feet till the other day

Rises up suddenly and flutters like a flag

On the victory stand.

He writes songs of freedom that

Fill the cosmos between earth and heaven.

He rolls down like a cataract in the hearts of the people.

Then, time unveils him as a seat of learning.

As for me,

I bury myself as a blade of grass … somewhere.

.

Aduri Satyavati Devi.

.

నాకు తెలుసు

నేను మాటలు పోగేయటం మొదలుపెట్టే నంటే

గాలివాటుకు సాగిపోయే

మబ్బుముక్కలా తేలిపోతానని

నా ఉనికినీ, అస్తిత్వాన్నీ కోల్పోతాననీ

అయినా నా అహాన్నీ ఆధిక్యతనీ వెదజల్లుతూనే ఉంటాను

.

నాకు తెలుసు

అవతలివాడు మౌనాన్ని ధరించాడంటే

మంటల్నీ, అవమానాల్నీ, సముద్రాల ఆవేశాల్నీ

మూటకట్టి జీవితం మీదకెక్కించుకుని

ఎంతో ఓర్పుగా మోస్తున్నాడనీ

కరుణాళువై చిగురించబోతున్నాడనీ.

.

నూతిలో కప్పలాగ ఉభయతారకంగా చరిస్తూ

నిన్నూ నన్నూ కూడగట్టుకుని

మెట్టుమీం చి మెట్టుకి ఎగబ్రాకుతుంటాన్నేను

వాడు మౌనాన్ని ముక్కలు ముక్కలుగా కరిగిస్తూ

జీవనాన్ని లక్ష్యాల గవాక్షానికి గురిపెట్టి పదునుతేలి వుంటాడు

చూపుల్ని సూర్యకిరణాల్లా మలుస్తాడు

ఆలోచనల్ని అవిశ్రాంతంగా పండిస్తాడు

మొన్న మొన్నటివరకూ నా పాదాలవద్ద పాకుతూ పాకుతూనే

ఒక్కసారిగా గెలుపుమీద రెపరెపమని ఎగురుతాడు

భూమీ ఆకాశమూ పట్టేంతటి స్వేఛ్ఛా గీతాల్ని లిఖిస్తాడు

జనం గుండెలమీద జలపాతంలా దొర్లుకొస్తాడు

అప్పుడు కాలం వాడినొక పాఠశాలనుచేసి ఆవిష్కరిస్తుంది

నేనొక గడ్డిమొక్కగా ఎక్కడో కూరుకుపోతా.

.

తెలుగు మూలం:  ఆదూరి సత్యవతీ దేవి.

“జలపాత గీతావిష్కరణం” (రెక్కముడవనిరాగం కవితా సంకలనం నుండి)

A Couplet … ST Coleridge

(25th July is the Death Anniversary of ST Coleridge. This is a  Couplet written in a volume of poems presented by him to Dr. A. )

To meet, to know, to love–and then to part,

Is the sad tale of many a human heart.

 

 

కలుసుకుని, తెలుసుకుని, ప్రేమించుకుని, చివరకు చీలిపోవడం

విషాదమయమైన మానవహృదయాల కథ…  చర్విత చర్వణం.

A Friend Indeed – Swarajyam Ramakrishna

It flickers last on the long drawn-out list of requirements.

But, it has its settled place in my pocket

Like the stretched string on a Veena*.

Drying my eyes and concealing my sighs within its layers,

It takes into its sure sweet hands

The momentous events of my life.

Standing by me in the thick and thin of the day

And never settling comely where it was put

It embraces me dearly

With love and concern

Only to get tarnished in return

With the shades of my sad and solemn moments.

Be it the droning swarm of hovering mirages,

Or the aroma of my fruitless love,

Or the fears and passions erupting out of sudden happenings

Why

It absorbs every single secret of my life into its fold

And waits on me, ever so eagerly

Extending a guileless friendly hand.

When sun is at his singeing best over the crown

It sponges over the perennial springs of sweat

Planting a deep endearing kiss and restores sanity.

At great gatherings, parties and while on travel

It always books me a seat at no cost

And becomes a handy wave of flag at see-offs.

No matter whether I caress it gently spraying scents

Or, wriggle and crumple and cast it off,

It waits a lifetime for my care and attention.

Unmindful of who calls on, it serves as selflessly

And stands out a symbol of love and fraternity.

It’s why I commend:

Present a hanky whomsoever you love.

**  **  **

*Veena: A famous South Indian String Instrument made from Sweet Gourd after hollowing it .

Telugu Original:  Mrs. Swarajyam Ramakrishna

As Usual… Arun Bavera, Telugu, Indian Poet

Cerebrations linger anew without day-break,

The look from under the old eyelids

Throws no fresh light,

All along the way … the clothes doffed yesterday.

Washed out colors  reveal no new meanings.

Letters won’t shed their wonted winding ways.

There is always a want  … for new connotations.

Nobody appreciates the jaded mural inscriptions

On paper.

The “As Usual”ness yawns

With demonic fangs every day.

The senile sea sits silent

swallowing the waves.

No new hopes gleam through the eyes,

Nor,  new sensations issue forth.

Blood streams on … putting out its fire,

And old enthusiasm in the body

Gets exposed to white ants.

Smouldering excitements pique… singeing the skin.

Memories of the past

Prick the heart at midnight.

Fractured dreams, always,

Hung on the heart-line to dry.

The whole journey — one,  that of  a tethered ghanny-ox.

.

Stale Seasons  give out … no sweet fragrances,

Old-fashioned Cuckoos … can’t sing new tunes

And for the new lyrics… old burdens are not meet

No conflict gives … room for novelty

No patient wait … gives voice to new songs.

.

Never-  the flutter of new sails is heard on the river

Always- A pall of pale moonlight extending on the plains!

.

Arun Bavera

3rd Aug 2001

.

షరా మామూలుగా…

.
కొత్త ఊహలు తెల్లారవు

పాత రెప్పల కింద చూపు

కొత్త వెలుగివ్వదు

దారిపొడుగునా నిన్న విడిచిన దుస్తులే

మాసిన రంగులు కొత్త భావాల్ని చెప్పవు

అక్షరాలు

పాత వంకర్లను వదులుకోవు

కొత్త అర్థాలు ఎప్పుడూ కరవే!

కాగితం మీద

పాతరాతల గోడలు ఎవరూ మెచ్చరు

షరా మామూలుతనం రోజూ

రాకాసికోరలతో ఆవులిస్తుంది

ముసలి సముద్రం

కెరటాలు మింగేసి కూచుంటుంది

కళ్ళల్లో కొత్త ఆశలు మొలకెత్తవు

కొత్త కదలికలు  ప్రసవించవు

రక్తం నిప్పులనార్పేసుకుని ప్రవహిస్తోంది

వొంట్లో పాత ఉత్సాహాలకి

చెదలు పడుతున్నాయి

పాత ఉద్రేకాలు

పురుగు ముడుతున్నాయి

అర్థరాత్రి గుండెల్లో

పాత జ్ఞాపకాల సలపరం

సదా చిరిగిన కలల్ని

మనసుమీద ఆరేసుకోవడం…

అంతా ఒకటే గానుగెద్దు ప్రయాణం

.

పాత ఋతువులేవీ పరిమళించవు,

పాత కోయిళ్ళు కొత్త పాటలు పాడవు

కొత్తపాటలకు పాత పల్లవులు సరిపడవు

ఏ సంఘర్షణా కొత్తదనానికి చోటివ్వదు

ఏ నిరీక్షణా కొత్తగీతాలకి గొంతివ్వదు.

.

ఎప్పుడూ- నదిలో తెరచాపల చప్పుడే వినిపించదు!

ఎప్పుడూ- ఆరుబయట రంగు వెలిసిన వెన్నెలే!

.

అరుణ్ బవేరా

ఆగష్టు 3, 2001

(ఒక కన్నీటి చుక్కకోసం కవితా సంకలనం నుండి)

The Last Touch- K. Geetha

My last respects to the feet visible on the funeral bed

This touch is the last memory of Daddy for all his life.

***

Daddy! Daddy!!

Did your sins agonize?

Or your telltale hand on mother’s neck torment you as wounds?

Ineluctable throes

Before heart rests or life ceases!

How moving was your wailing unable to endure, as

You substituted the voice failed three years hence, with your fingers !!

Whenever tears well up for you….

Your keeping guard dozing outside the rest room

Boxing my back when I did not heed your word,

My sister and I playing merry-go-round with your hands, and

the cracking of our bones as you removed the body-pack, once  a year, for Pongal,  …

Are the few, little , hazy memories that flash in my memory-scape.

Whenever mother’s eyes filled with tears

I felt like burning you with petrol

But strangely, yesterday, I wished you were rather alive.

Forsaking your duties

Living only for yourself

What did you achieve?

Extreme pleasure…

And extreme grief.

You became a specimen for people … how not to be

And couldn’t  be a coveted figure in any heart.

Didn’t I tell you that you will be relieved and everything would be alright?

Being aware that death is the only cure for you,

I told you to buck up and not to worry.

How can I forget, when can I forget

Those eyelids eagerly searching for me in the last hour?

Your pangs entreating to hold your hand?

You were a devil that put my mother to every hardship.

You were a father who no one would ever like,

But Yet, I felt a part of me had burnt to ashes.

When brother called ‘Daddy!’ into your corporal ear

I had an urge to shake you up and take you back home.

As the filing logs concealed your hands and bosom

I felt like crying you can’t bear that burden.

When I mercilessly awaited your skull to incinerate in the raging pyre,

The grief piled up to heart’s brim, had ultimately burst out.

.

చివరి స్పర్శ

.

పేర్చిన చితిలో కన్పడే కాళ్ళకు ఆఖరి నమస్కారం

జీవితం మొత్తమ్మీద డాడీ గుర్తుగా చివరి స్పర్శ జ్ఞాపకం

పాపాలు పీడించాయా

అమ్మ మెడమీద నీ చేతి గాట్లే గాయాలై వేధించాయా

గుండె ఆగడాన్కి

జీవి మరణించడాన్కి తప్పని పెనువేదన-

మూడేళ్ళకిందటే మూగదైన గొంతుని చేతివేళ్లలో నింపి

ఎంతగా రొదించావో తట్టుకోలేకపోతున్నానని

నీకోసం కళ్ళు నిండినప్పుడల్లా

చిన్నప్పుడెప్పుడో రాత్రుళ్ళు నా కోసం

మరుగుదొడ్డిబయట కునికిపాట్లు పడడం

చెప్పినమాట వినకపోతే నీ వీపుమీద బాక్సింగ్ చేయడం

చెల్లీ, నేనూ నీ భుజాల్ని పట్టుకుని రంగుల రాట్నం తిరగడం

ఏడాదికోసారి భోగినలుగుల్లో మా ఎముకలు నలగడం

ఒకటొ -అరగా- మిగిలిన చిందే చిన్ని జ్ఞాపకాలు

అమ్మ కళ్ళు నిండినప్పుడల్లా

పెట్రోలేసి నిన్ను తగలెయ్యాలన్పించేది

నిన్న- ఎందుకో బతికితే బావుణ్ణనిపించింది

బాధ్యతలు విస్మరించి

నీ కోసం నువ్వు జీవించి

నువ్వు పొందిందేమిటి?

అత్యంత ఆనందం-

అత్యంత విషాదం-

నిన్ను చూసినవాళ్ళకో గుణపాఠం గా మిగిలేవు కానీ

ఏ ఒక్క గుండెలోనూ చిత్రపటం కాలేకపోయావు

డేడీ! డేడీ!

నే చెప్పానుకదా- అన్నీ తగ్గిపోయి మళ్ళీబాగైపోతుందని

మరణమే నీశరీరానికి మందని తెల్సీ

నే చెప్పాను కదా- ఏమీ కాదు ధైర్యంగా వుండమని

చివరి గంటల్లో నాకోసం కొట్టుకున్న నీ కనుగుడ్లు

చెయ్యి పట్టుకోమని వ్యధపడ్డ నీ అవస్థలు

ఎలా మర్చిపోను? ఎప్పటికి మర్చిపోను??

నువ్వు నాకు వద్దనిపించే నాన్నవి

అమ్మని కష్టపెట్టిన రాక్షసుడివి

అయినా నా శరీరం లో భాగం కాలి బూడిదైనట్లయింది

పార్థివ కర్ణం లో అన్నయ్య ‘డేడీ!” అని పిల్చినప్పుడు

నిన్నుపట్టి కుదిపి వెనక్కి తీసుకెళ్ళిపోవాలన్పించింది

పేర్చే కట్టెలు నీ చేతుల్నీ, గుండెనీ మూస్తున్నప్పుడు

అంతబరువు ఆనుకోలేవని అరవాలంపించింది

నిర్దాక్షిణ్యంగా నిప్పుల్లో నీ కపాలమోక్షం కోసం ఎదురుచూసినపుడు

నా హృదయం చివర గాఢంగా వేలాడుతున్న దుఃఖం పెటేలున పగిలింది.

జనవరి 2, 2006

కె. గీత ( శీతసుమాలు కవితా సంకలనం నుండి)

%d bloggers like this: