అనువాదలహరి

పాతముఖాలు … Charles Lamb

.

నా బాల్యంలో, ఆనందంగా  బడికెళ్ళే రోజుల్లో

నాకూ ఆట తోడూ, సావాసగాళ్ళూ ఉండేవాళ్ళు ,

 పరిచయమైన ఆ పాత ముఖాలన్నీ, అన్నీ వెళ్ళిపోయాయి.

 .

నేను నా నేస్తాలతో నవ్వుతూ, తాగుతూ, తుళ్ళుతూ,

రాత్రి రెండో ఝాముదాకా మేలుకునే వాడిని

 పరిచయమైన ఆ పాత ముఖాలన్నీ, అన్నీ వెళ్ళిపోయాయి.

.

నేనూ ఒకప్పుడు ప్రేమించాను, స్త్రీలలో అతిసౌందర్యవతిని.

ఆమె ద్వారాలు నాకై తెరుచుకోవు… నేనామెను చూడప్రయత్నించకూడదు.

పరిచయమైన ఆ పాత ముఖాలన్నీ, అన్నీ వెళ్ళిపోయాయి.

 .

నాకో మిత్రుడుండేవాడు… అంత నెనరైనవాడింకొకరికుండడు  

కృతఘ్నుడిలా, అతన్ని అర్థాంతరంగా వదిలేసాను;

వదిలేసాను… ఆ పాత పచయమైన ముఖాలకై విచారిస్తున్నాను.

.

నన్ను వెంటాడుతున్న బాల్యస్మృతులచుట్టూ నేనోప్రేతంలా తిరుగాడుతున్నాను,

పరిచయమైన ఆ పాతముఖాలను వెతుక్కుంటూ

నేన్నడవవలసిన ఎడారిలా నేల నాకు కనిపిస్తోంది.

.

ఆప్తమిత్రమా! నువ్వునా సోదరిడికన్నా మిన్న.

అసలు నువ్వు నాకు తోబుట్టువై ఎందుకు పుట్టలేదు?

పరిచయమైన ఆ పాతముఖాలగురించి మాట్లాడుకునేవాళ్ళంగదా!

.

కొందరెలాపోయారో! కొందరు నన్ను వదిలేసారు,

కొందరు నా దగ్గరనుండి లాక్కోబడ్డారు, అందరూ వెళిపోయారు

పరిచయమైన ఆ పాత ముఖాలన్నీ, అన్నీ వెళ్ళిపోయాయి.

                                                         ***   ***   ***

The Old familiar Faces…. 

.

I have had playmates, I have had companions,

In my days of childhood, in my joyful schooldays:

All, all are gone, the old familiar faces.

.

I have been laughing, I have been carousing,

drinking late, sitting late, with my bosom cronies,

All, all are gone, the old familiar faces.

.

I loved a Love once, fairest among women;

Closed are her doors on me, I must not see her—

All, all are gone, the old familiar faces.

.

I had a friend, a kinder friend has no man:

like an ingrate, i left my friend abruptly;

Left him, to muse on the old familiar faces.

.

Ghost-like I paced round the haunts of my childhood,

Earth seem’d a desert I was bound to traverse,

Seeking to find the old familiar faces.

.

Friend of my bosom, thou more than a brother,

why wert not thou born in my father’s dwelling?

So might we talk of the old familiar faces.

.

How some they have died, and some they have left me,

And some are taken from me; all are departed:

All, all are gone, the old familiar faces.

.

English Original:  Charles Lamb

%d bloggers like this: