అనువాదలహరి

మృత్యు హేల … Neruda

.

అక్కడ ఒంటరి శ్మశానాలున్నాయి,

సమాధులనిండా చప్పుడుచెయ్యని ఎముకలు,

సొరంగంగుండా ప్రయాణిస్తున్న మనసు,

అంతా చీకటి, చీకటి, చీకటిమయం,

పగిలిపోయిన ఓడలా మనలోకే మన మహాభినిష్క్రమణం,

మన మనసుల్లోకే  మనం మునిగిపోతున్నట్టు,

మన శరీరం నుండి విడివడి ఆత్మలోకి జారి బతికినట్టు.

.

అక్కడ శవాలున్నాయి,

పాదాలు చల్లగా, బంకమట్టితో చేసినట్టు,

ఎముకల్లో మృత్యువుంది,

కుక్కలు లేకుండా  వినిపిస్తున్న మొరుగుడులా

ఎక్కడో దూరంగా రుద్రభూములనుండి వస్తున్న గంటానాదంలా

చెమ్మగా ఉన్న గాలిలో వర్షిస్తున్న కన్నీళ్ళలా .

.

ఒక్కోసారి నాకు

ఒంటరిగా ప్రయాణమౌతున్న శవపేటికలు కనిపిస్తుంటాయి,

పాలిపోయిన మృత యాత్రికులను తీసుకునిపోతూ,

మహిళల కేశాలు నిర్జీవంగా ఉంటాయి,

Bakers దేవదూతల్లా తెల్లగా

Notaryలతో వివాహితలైన ఫ్రౌఢలు విషణ్ణవదనలై

శవపేటికలు నిలువుగా

ప్రవాహానికి వ్యతిరేకంగా

మృత్యురవంతో ఎగసిన తెరచాపలతో

మృత్యు రవమైన నీరవంతో నిండి

ముదురు గులాబీవర్ణంగల ‘వైతరణి’ ని దాటుతూ.

.

మృత్యువు ముఖ్యంగా

కాళ్ళులేని బూటు చేసే చప్పుడులా

మనిషిలేని సూటులా ప్రవేశిస్తుంది.

వచ్చి తలుపు తడుతుంది,

పొడి లేని ఉంగరంతో,

అసలు వేలే లేని ఉంగరంతో

వచ్చి అరుస్తుంది

నోరుగాని, నాలుకగాని, గొంతుకగాని ఉండవు.

అయినప్పటికీ, దాని అడుగులు వినిపిస్తునే ఉంటాయి,

దాని ఆహార్యం సడిలేనిసవ్వడి చేస్తుంది, చెట్లలా…

.

నాకు సందేహమే, ఎందుకంటే నాకు కొంచెమే తెలుసు,

నాకసలు కనేకనిపించదు,

కాని నాకనిపిస్తుంది, దాని పాటలో తడిసిన ఊదారంగుపూల ఛాయ ఊందేమోనని,

భూమిమీద హాయిగావికసించే నల్లకలువలలాంటి ఊదారంగుపూలు,

మృత్యువు ముఖం హరితంగా ఉంటుంది,

అందుకంటే చావు శరీరానికి  పచ్చరంగు అద్దుతుంది గనుక,

దానిలో తీవ్రమైన హేమంతపు విషాద వివర్ణంతోపాటు,

నవనాడులలోకీ చొచ్చుకుపోయిన చల్లదనం ఉంటుంది.

.

కానీ, మృత్యువు చీపురు వేషం వేసుకుని ప్రకృతిలో పరిభ్రమిస్తుంది,

నేలను ఊడుస్తూ, శవాలకై  గాలిస్తూ,

మృత్యువు చీపురులోనే ఉంది,

చీపురు శవాలకై వెదికే మృత్యువు నాలుక,

అది దారానికై వెదికే సూది.

.

మృత్యువు మడతమంచాల్లో ఉంటుంది

నల్లని దుప్పట్లలోనూ

బొంతలమీదా నిద్రించి దాని జీవితం గడిపి,

అకస్మాత్తుగా ప్రాణం విడుస్తుంది:

ఎంత విషాదభరమైన కేకవేస్తుందంటే

ఆ పెడబొబ్బకి దుప్పట్లు తెరచాపల్లా విచ్చుకుని

శయ్యలు పడవలై ఏదో తీరాలకు ప్రయాణమౌతై.

అక్కడ admiral వేషంలో  మృత్యువు నిరీక్షిస్తుంటుంది.

.

Nothing But Death

.

There are cemeteries that are lonely,

graves full of bones that do not make a sound,

the heart moving through a tunnel,

in it darkness, darkness, darkness,

like a shipwreck we die going into ourselves,

as though we were drowning inside our hearts,

as though we lived falling out of the skin into the soul.

.

And there are corpses,

feet made of cold and sticky clay,

death is inside the bones,

like a barking where there are no dogs,

coming out from bells somewhere, from graves somewhere,

growing in the damp air like tears of rain.

Sometimes I see alone coffins under sail,

embarking with the pale dead, with women that have dead hair,

with bakers who are as white as angels,

and pensive young girls married to notary publics,

caskets sailing up the vertical river of the dead,

the river of dark purple,

moving upstream with sails filled out by the sound of death,

filled by the sound of death which is silence.

.

Death arrives among all that sound

like a shoe with no foot in it, like a suit with no man in it,

comes and knocks, using a ring with no stone in it, with no finger in it,

comes and shouts with no mouth, with no tongue, with no throat.

Nevertheless its steps can be heard

and its clothing makes a hushed sound, like a tree.

.

I’m not sure, I understand only a little, I can hardly see,

but it seems to me that its singing has the color of damp violets,

of violets that are at home in the earth,

because the face of death is green,

and the look death gives is green,

with the penetrating dampness of a violet leaf

and the somber color of embittered winter.

But death also goes through the world dressed as a broom,

lapping the floor, looking for dead bodies,

death is inside the broom,

the broom is the tongue of death looking for corpses,

it is the needle of death looking for thread.Death is inside the folding cots:

it spends its life sleeping on the slow mattresses,

in the black blankets, and suddenly breathes out:

it blows out a mournful sound that swells the sheets,

and the beds go sailing toward a port

where death is waiting, dressed like an admiral

%d bloggers like this: