అనువాదలహరి

శ్మశాన వాటి 1… జాషువా

.

Aeons passed; not one amongst this ill-fated dwellers of this field

had ever woken up. Pity! How long they sleep vegetable?

O poor me! How many moms were shattered and grieved

Surely, these rocks were scald with the searing tears over years

.

ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గానీ, ఈ  శ్మశానస్థలిన్

కన్నుల్మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచిరా, డక్కటా!

ఎన్నాళ్ళీ చలనంబులేని శయనం బే తల్లు లల్లాడిరో,

కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్.

.

తెలుగు మూలం:  మహాకవి గుర్రం జాషువా

నిరాశా గీతం – part 2 Neruda

ఓ శిధిలావశేషాల రాశీ! అన్నీ నీలోలయించాయి.
నువ్వు ప్రకటించని విషాదం ఏది, నువ్వు మునక వెయ్యని విషాదం ఏది!

ఓడముందు నిలబడి,  నావికునిలా
ఉత్తుంగ తరంగాలపైనుండి నువ్వు పిలుస్తూ ఆలపిస్తున్నావు.

నువ్వు గీతాల్లో ఇంకా వికసిస్తూనే ఉన్నావు, కెరటాల్ని అదుముతూనే ఉన్నావు,
ఓ శిధిలావశేషాల రాశీ! నువ్వొక గట్టులేని క్షారజల కూపానివి.

పాలిపోయిన శీఘ్ర చోదకుడూ, అదృష్టంలేని వడిశల వేటగాడూ,
దారితప్పిన శోధకుడూ, అందరూ నీలో లయించారు.

ఇది ఇక నిష్క్రమించవలసిన సమయం, రాత్రి ప్రతి ఝాముకీ
నిర్దేశించినట్టు, ఇప్పుడు చలి వణికించే వేళ.

ఘోషిస్తున్న కెరటాలు ఒడ్డును చుట్టుముడుతున్నాయి.
మంచుముక్కల్లా తారలు మీదకు లేస్తున్నాయి, నల్లని నీటికొంగలు వలసపోతున్నాయి.

తెల్లవారుఝామున ఓడరేవులా చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది.
వణుకుతున్న నీడలు నా చేతిలో వంకరలుపోతున్నాయి.

ఓహ్. అన్నిటికీ దూరంగా, అన్నిటికీ దూరంగా.
ఇది నిష్క్రమించవలసిన సమయం. ఓ నా వర్జితా!

—-Pablo Neruda

%d bloggers like this: