అనువాదలహరి

కుక్క చచ్చిపోయింది— Neruda

.

నా కుక్క చచ్చిపోయింది.
దాన్ని నా  పెరట్లో పాతిపెట్టాను.
తుప్పుపట్టిన పాత మెషీను పక్కగా.

ఏదో రోజు నేను కూడా అక్కడే దాని పక్కన చేరుతాను,
ఇప్పటికి మాత్రం దాని బొచ్చుతో,
దాని అవలక్షణాలతో, దాని జలుబుతో అది పోయింది,
నాస్తికుణ్ణయిన నేను ఎన్నడూ
మనిషికి ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో స్వర్గం ఉందంటే నమ్మలేదు,
నాకు తెలుసు నేను స్వర్గంలో మాత్రం ఎప్పుడూ అడుగు పెట్టను.
కాని, నేను కుక్కలకి స్వర్గం ఉందంటే  నమ్ముతాను…
అక్కడ అది స్నేహపూర్వకంగా,
విసనికర్ర లాంటి  దానితోక ఊపుకుంటూ నాకోసం ఎదురుచూస్తుంటుంది.

అదుగో, నేను ఇక్కడ భూమి మీద ఏడుపు కబుర్లు చెప్పను
ఎన్నడూ బానిసగా బతకని ఒక తోడును కోల్పోయానని…
దాని స్నేహం ఎలాంటిదంటే,
ముళ్ళపంది  తన ముళ్ళు గుచ్చుకోకుండా మెసలిన లాంటిది,
ఒక నక్షత్రంతో స్నేహం లాంటిది…
దూరంగా, అవసరానికి మించని చనువుతో,
అతిశయోక్తులు లేకుండా:
అది ఎన్నడూ నా ఒంటిమీద ఎక్కి తొక్కడం గాని,
నా బట్టలని దాని బొచ్చుతోనూ, గజ్జితోనూ నింపడం గాని చెయ్యలేదు.
మిగతా చిత్తకార్తి కుక్కల్లా కాకెత్తిపోయి
నా ముణుక్కి రాయనూ లేదు.

లేదు, నా కుక్క ఎప్పుడూ  నా వంక తేరిపార చూసేది,
అవసరమైనంత  ధ్యానం నాకిస్తూ,
నాలాంటి పొగరుబోతుకి తగినంత శ్రధ్ధ కనబరుస్తూ
కుక్కగా అది తనజీవితాన్ని వ్యర్థం చేస్తున్నాదని నాకు అర్థం అయేలా,
కాని, దాని నాకళ్ళకంటే స్వఛ్ఛమైన దాని కళ్ళతో
నావంకే, నాకోసమే ప్రత్యేకించిన శ్రధ్ధతో చూస్తుండేది,
నన్ను ఎన్నడూ ఇబ్బంది పెట్టకుండా,
ఏనాడూ ఇదికావాలని అడక్కుండా,
ఎప్పుడూ నన్ననుసరిస్తూనే
బొచ్చుకుక్క దాని జీవితకాలం గడిపింది.

*Isla Negra కెదురుగా
వంటరి శీతాకాలం  సముద్రతీరంలో
మేమిద్దరం  నడుస్తున్నప్పుడు,
ఆకాసాన్ని వలస  పక్షులు కమ్మేసి ఉంటే,
నా బొచ్చుకుక్క సముద్రానికున్నంత శక్తితో
ఎగురుతూ, దాని పసిడి వర్ణపు తోకను ఎత్తిపెట్టి మరీ
సముద్రపు  నురగను ఆఘ్రాణిస్తున్నప్పుడు,
ఎన్నిసార్లు దాని తోకను చూసి నేనసూయపడలేదు

ఆనందంగా, ఆనందంగా, ఆనందంగా,
ఒక్క కుక్కలకి  మాత్రమే అవగతమైన ఆనందంతో,
వాటి సహజ స్వేఛ్ఛా,  నిర్లజ్జా ప్రకృతితో.

చనిపోయిన నా కుక్కకీ నాకూ ‘వెళ్ళొస్తాను’లు లేవు.
ఇప్పుడూ  ఎప్పుడూ ఒకరికొకరు అబధ్ధాలు చెప్పలేదు.

ఇప్పుడది చచ్చిపోయింది, దాన్ని నేను ఖననం చేశాను.
అంతే, చెప్పడానికింకేమీ లేదు.

— Pablo Neruda

—————————————

* It is the residence of Pablo Neruda in Chile, now converted to a museum

A Dog Has Died

My dog has died,
I buried him in the garden
next to a rusted old machine

Some day I’ll join him right there,
but now he’s gone with his shaggy coat,
his bad manners and his cold nose,
and I, the materialist , who never believed
in any promised heaven in the sky
for any human being,
I believe in a heaven for all dogdom
where my dog waits for my arrival
waving his fan-like tail in friendship.

Ai,I ‘ll not speak of sadness here on earth,
of having lost a companion
who was never servile.
His friendship for me, was like that of a porcupine
withholding its authority,
was the friendship of a star, aloof,
with no more intimacy than was called for,
with no exaggerations:
he never climbed all over my clothes
filling me full of his hair or his mange,
he never rubbed up against my knee
like other dogs obsessed with sex.

No, my dog used to gaze at me,
paying me the attention I need,
the attention required
to make a vain person like me understand
that, being a dog, he was wasting his time,
but, with those eyes so much purer than mine,
he’d keep on gazing at me
with a look that reserved for me alone
all his sweet and shaggy life,
always near me, never troubling me,
and asking nothing.

#Ai, how many times have I envied his tail
as we walked together on the shores of the sea
in the lovely winter of Isla Negra
where the wintering birds filled the sky
and my hairy dog was jumping about
full of the voltage of the sea’s movement:
my wandering dog, sniffing away
with his golden tail held high,
face to face with the ocean’s spray.

Joyful, joyful, joyful,
as only dogs know how to be happy
with only the autonomy
of their shameless spirit.

There are no good-byes for my dog who has died,
and we don’t now and never did lie to each other.

So now he’s gone and I buried him,
and that’s all to it.

.

%d bloggers like this: