అనువాదలహరి

అత్యంత విషాద గీతం… Neruda

.

అత్యంత  విషాద గీతం

.

ఈ రాత్రి నే నత్యంత విషాదగీతం రాయగలను.

ఉదాహరణకి “రాత్రి నక్షత్రాలతో నిండి ఉంది.
ఆ నీలి నక్షత్రాలు దూరం నుండి మినుకు మినుకు మంటున్నాయి” అని రాయగలను.

రాత్రి రొజ్జగాలి గింగిరాలు తిరుగుతూ పాడుతోంది.

ఈ రాత్రి నేను అత్యంత  విషాదగీతం రాయగలను.
నేనామెను ప్రేమించాను. ఆమెకూడా నన్ను కొన్నిసార్లు ప్రేమించింది.

ఇలాంటిరాత్రిళ్లలోనే, నేనామెను నా కౌగిలిలోకి తీసుకున్నాను.
అనంతాకాశం క్రింద ఆమెను లెక్కలేనన్నిసార్లు ముద్దుపెట్టుకున్నాను.

ఆమె నను ప్రేమించింది. నేనుకూడా కొన్నిసార్లు ఆమెను ప్రేమించాను.
ఆమె విశాలమైన, నిశ్చలమైన కళ్ళను  ప్రేమించకుండా ఎలా ఉండగలను?

నేనీ రాత్రి అత్యంత  విషాదగీతం రాయగలను
ఆమె నాకు లేదన్న ఊహ. ఆమెను పోగొట్టుకున్నానన్న బాధ.

ఈ చిక్కని రాత్రి ఆమె లేమితో ఇంకా చిక్కగా ఉంది.
పచ్చికమీద రాలే మంచులా కవిత మనసుమీద వాలిపోతోంది.

నా ప్రేమ ఆమెను నిలుపుకోలేకపోతే ఏమయిపోతుంది?

రాత్రి నిండా నక్షత్రాలున్నాయి, ఆమె మాత్రం నా ప్రక్కన లేదు.

అంతే! ఎక్కడో దూరంగా ఎవరో ఆలపిస్తున్నారు. చాలా దూరంగా.
ఆమె లేకపోవడంతో, నా మనస్సు ఇంకా ఆర్ద్రమౌతోంది.

ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చేందుకా అన్నట్టు నా కళ్ళు ఆమెకై వెతుకుతున్నాయి.
నామనసు ఆమెకై వెతుకుతోంది, ఆమె నా ప్రక్కన లేదు.

ఆవే చెట్లు –  వాటిని తెల్లబరుస్తూ అదేరాత్రి.
మేమైన మేము, ఇక ఎన్నటికీ మేము కాలేకున్నాము.

ఇక నేనామెను ప్రేమించడం లేదు. నిజమే, ఆమెనెంతగా ప్రేమించాను.
ఆమె చెవిని తాకడానికి నా గొంతు గాలినెంతగా గాలించిందని.

ఆమె పరాయిది. ఆమె ఇంకొకరిదయిపోతుంది. ఒకప్పుడు నా ముద్దులకు చెందినట్టు.
ఆమె గొంతు, తూలిక లాంటి శరీరమూ, ఆమె లోతైన కళ్ళూ.

ఆమెను నేనింక ప్రేమించడం లేదు. నిజం, ఏమో ప్రేమిస్తున్నానేమో.
ప్రేమ క్షణికం, మరపు అనంతం.

ఇలాంటి  నిశలలోనే ఆమెను నా చేతులలో పొదువుకున్నాను.
ఆమె లేక నా మనసు మనసులో లేదు.

ఆమె నాకు కలిగించే చివరి వ్యధ ఇదే అయినప్పటికీ,
ఆమె గురించి నేను రాసే చివరి కవిత ఇదే అయినప్పటికీ.

.

Saddest Poem

I can write the saddest poem of all tonight

Write, for instance:”The night is full of stars,
and the stars, blue, shiver in the distance.”

The night wind whirls in the sky and sings.

I can write the saddest poem of all tonight.
I loved her, and sometimes she loved me too.

on night like this, I held her in my arms.
I kissed her so many times under the infinite sky.

She loved me, and sometimes I loved her.
How could I not have loved her large, still eyes?

I can write the saddest poem of all tonight
To think I don’t have her. To feel that I’ve lost her.

To hear the immense night, more immense without her.
And the poem falls to the soul as dew to grass.

What does it matter my love couldn’t keep her.

The night is full of stars and she is not with me.

That’s all. Far away, someone sings. Far away.
My soul is lost without her.

As if to bring her near, my eyes search for her.
My heart searches for her and she is not with me.

The same night that whitens the same trees.
We, we who were, we are the same no longer.

I no longer love her, true, but how much I loved her.
My voice searched the wind to touch her ear.

Someone else’s. She will be someone else’s. As she once
belonged to my kisses.
Her voice, her light body. Her infinite eyes.

I no longer love her, true, but perhaps I love her.
Love is so short and oblivion is long.

Because on nights like this I held her in my arms,
my soul is lost without her.

Although this may be the last pain she causes me,
and this may be the last poem I write of her.

….  Pablo Neruda

%d bloggers like this: