జెండా అంటే ఏదో కొంత భూభాగం కాదు… NS Murty

జెండా అంటే వివిధ వర్ణాలనూ,

రోదసినుండి నక్షత్రాల, గ్రహాల, ఉపగ్రహాల,

ప్రకృతిలోని జీవజాలాల రేఖలతో

మానవ మేధ సృష్టించిన ఉపకరణాల రేఖలను

తోచినట్టు కలగలిపి అందంగా తీర్చిదిద్దిన

ఏవో నాలుగు కొలతలున్న రంగుగుడ్డముక్క కాదు.

 .

జెండా అంటే … ఒక జాతి ఆలోచనా స్రవంతి.

ప్రజల జీవనాడి…భవిష్యదాశాసౌధం. 

ఆకసాన్ని సైతం ధిక్కరిస్తూ,

పోటెత్తిన అజ్ఞాత జనసమూహాల త్యాగాల వెల్లువ.

శతాబ్దాల నిదాఘదాస్యనిశీధినుండి జారిపడి

రూపుదాల్చిన అపురూప ఆకాంక్ష.

దాని రెపరెపల గలగలల్లో

రాజ్యహింసను అవలీలగా అనుభవిస్తూ,

భావితరాలకు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుందికి

ప్రాణం తృణప్రాయంగా తీసుకుని,

ఒక వంక మృత్యువును కౌగిలిస్తూనే,

రెండోవంక వందేమాతరం అంటూనేలరాలిన

చరిత్రకినోచుకోని ఎందరో మృతవీరులు

గొంతు జీరబోయేదాకా

దిగ్దిగంతాలు మారుమోగేలాచేసిన నినాదాల

 ప్రతిద్వనులు వినిపిస్తుంటాయి

.

జెండా అంటే, నాలుగు హద్దులు గీసి,

ఏదో ఒక నామకరణం చేసిన జాగా కాదు.

దాని నీడలో ఒక దేశపు జవసత్త్వాలు దాగున్నాయి.

దాని గలగలల్లో భావితరాల భవిష్యత్తు నిక్షిప్తమై ఉంది

English Original: NS Murty

Flag is not a Territory

A Flag is not a chequered band of colors
With a mosaic of celestial bodies
Or a selection of nature’s or man’s designs and derivatives.

It is stream of conscience
An ethos of a people
It is the high tide of sacrifice
That surges up to the skies to flutter.

It is the dream that filtered through long nights of bondage.
In the whirr of its flutters you listen
The hoarse voices of martyrs
Embracing every kind of death without demur
Reverberating to the limits of cosmos
Making their promises to the future.

In its shade lies the strength of a nation
Not a piece of land with some connotation. 

  

 

 

“జెండా అంటే ఏదో కొంత భూభాగం కాదు… NS Murty” కి 5 స్పందనలు

 1. English kavitha daniki telugu anuvadamu rendu manasunu taketlu vunnayandi!

  మెచ్చుకోండి

 2. English kavitha telugu anuvadamu rendu manasunu taketlu vunnayi!

  మెచ్చుకోండి

  1. హనుమంత రావు గారూ,

   ముందుగా సమయం చేసుకుని నా బ్లాగు దర్శించినందుకు ధన్య వాదాలు.

   మీ అభిప్రాయం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కృతజ్ఞతలు.

   మెచ్చుకోండి

 3. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

  – శి.రా.రావు
  శిరాకదంబం

  మెచ్చుకోండి

  1. శ్రీ రావు గారూ,

   కృతజ్ఞతలు. మీకూ, మీ కుటుంబ సభ్యులకు కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: