అనువాదలహరి

నిన్ను ప్రేమించకుండా ఉండలేను గనుకనే నిన్ను ప్రేమించ లేను – Neruda

నిన్ను ప్రేమించకుండా ఉండలేను గనుకనే నిన్ను ప్రేమించ లేను;

ప్రేమించడం నుండి నిన్ను ప్రేమించకపోవడంవైపు మరలుతున్నా,

నీ కోసం నిరీక్షించడం నుండి, ఎదురుచూడకపోవడం వైపు మరలుతున్నా

నా హృది, నిర్లిప్తతనుండి, జ్వలనం వైపు నడుస్తోంది. 

నిన్నెందుకు ప్రేమిస్తున్నానంటే, నిన్నే నేను ప్రేమిస్తున్నాను గనుక;

నిన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నాను, అలా ద్వేషిస్తూనే 

నీ వైపే ఒరుగుతున్నాను,దానికి కొలమానం

నీవంక చూడకుండా నిన్ను గుడ్డిగా ప్రేమించడమే.

బహుశ, జనవరినెల వెలుతురు

దాని నిర్దాక్షిణ్యమైన వాడి వేడి కిరణాలతో,

నా ప్రశాంతతారహస్యాన్ని  దోచుకున్నదై, దహించవచ్చు. 

ఈ కథలో చివరకు మరణించేది నేనే,ఒక్క నేనే,

ఎందుకు మరణిస్తానంటే నిన్ను ప్రేమిస్తున్నాను గనుక,

ప్రియతమా! అగ్నిలో దహించినా, నెత్తురు విరజిమ్ముతున్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను గనుక.

Do Not Love You Except Because I love You

I do not love you except because I love you;

I go from loving to not loving you,

From waiting to not waiting for you

My heart moves from cold to fire.

I love you only because it’s you the one I love;

I hate you deeply, and hating you

Bend to you, and the measure of my changing love for you

Is that I do not see you but love you blindly.

Maybe January light will consume

My heart with its cruel

Ray, stealing my key to true calm.

In this part of the story I am the one who

Dies, the only one, and I will die of love because I love you,

Because I love you, Love, in fire and blood.

Pablo Neruda

జెండా అంటే ఏదో కొంత భూభాగం కాదు… NS Murty

జెండా అంటే వివిధ వర్ణాలనూ,

రోదసినుండి నక్షత్రాల, గ్రహాల, ఉపగ్రహాల,

ప్రకృతిలోని జీవజాలాల రేఖలతో

మానవ మేధ సృష్టించిన ఉపకరణాల రేఖలను

తోచినట్టు కలగలిపి అందంగా తీర్చిదిద్దిన

ఏవో నాలుగు కొలతలున్న రంగుగుడ్డముక్క కాదు.

 .

జెండా అంటే … ఒక జాతి ఆలోచనా స్రవంతి.

ప్రజల జీవనాడి…భవిష్యదాశాసౌధం. 

ఆకసాన్ని సైతం ధిక్కరిస్తూ,

పోటెత్తిన అజ్ఞాత జనసమూహాల త్యాగాల వెల్లువ.

శతాబ్దాల నిదాఘదాస్యనిశీధినుండి జారిపడి

రూపుదాల్చిన అపురూప ఆకాంక్ష.

దాని రెపరెపల గలగలల్లో

రాజ్యహింసను అవలీలగా అనుభవిస్తూ,

భావితరాలకు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుందికి

ప్రాణం తృణప్రాయంగా తీసుకుని,

ఒక వంక మృత్యువును కౌగిలిస్తూనే,

రెండోవంక వందేమాతరం అంటూనేలరాలిన

చరిత్రకినోచుకోని ఎందరో మృతవీరులు

గొంతు జీరబోయేదాకా

దిగ్దిగంతాలు మారుమోగేలాచేసిన నినాదాల

 ప్రతిద్వనులు వినిపిస్తుంటాయి

.

జెండా అంటే, నాలుగు హద్దులు గీసి,

ఏదో ఒక నామకరణం చేసిన జాగా కాదు.

దాని నీడలో ఒక దేశపు జవసత్త్వాలు దాగున్నాయి.

దాని గలగలల్లో భావితరాల భవిష్యత్తు నిక్షిప్తమై ఉంది

English Original: NS Murty

Flag is not a Territory

A Flag is not a chequered band of colors
With a mosaic of celestial bodies
Or a selection of nature’s or man’s designs and derivatives.

It is stream of conscience
An ethos of a people
It is the high tide of sacrifice
That surges up to the skies to flutter.

It is the dream that filtered through long nights of bondage.
In the whirr of its flutters you listen
The hoarse voices of martyrs
Embracing every kind of death without demur
Reverberating to the limits of cosmos
Making their promises to the future.

In its shade lies the strength of a nation
Not a piece of land with some connotation. 

  

 

 

%d bloggers like this: