తమ యుగళనృత్యపుహేలతో ఒక అపూర్వమైన జాడను విడిచివెళ్ళారు వారు ఆ త్రోవ విపరీత భావనల సమ్మేళనం సంతోషం / సంతాపం, ఆవేదన / ఆనందం నవ్వూ / కన్నీరూ, అన్యోన్యత / గౌరవం… వినీల ప్రేమాకాశంలో వింతవన్నెలరంగుల ఉల్కాపాతం
విధి వాళ్ళ అద్భుతగాథను కాలాతీతం చేసింది… ఉంచిందామె చేతిలో ఒక పరాయి చెయ్యి “తప్పదు” అందామె. ఏకాకిగా నిలబడిపోయాడతడు అంతుచిక్కని అగాథంలోకి తొంగి చూస్తూ… కళ్ళుమూసుకుని పిడికిలిబిగించి ఒక్కసారి ఎగిరేడు రెక్కలు తొడుగుకుని, విశ్వాసపు వీచికలమీద రెక్కలార్చుకుంటూ…
ఆశగా వీక్షించిందామె తన ప్రియుని విధురవియద్యానం గుర్తుకొచ్చింది– అతనిచ్చిన వీడ్కోలు బహుమతి తమ స్ఫటికాశ్రువులు పదిలపరుచుకుందికొక పైడిగిన్నె. ఆ గాజుతొడుగు నడుమ భద్రంగా- నాజూకుగా పెనవేసుకున్న ఆమె గుండెమధ్యనుండి అతని రాగరంజిత హృదయం నవ్వింది.
ఆ తీయని హృదయాశ్లేషనుండి అతని హృదయం పలికింది మనప్రేమ అమరం…
స్పందించండి