రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 2 వ భాగం

పంచమాంకం                                        దృశ్యం 2  

త్రిభుల- సుల్తాన్

సుల్తాన్: చాలా బరువుగా ఉంది. ఏదీ? ఒక చెయ్యి వెయ్యి! ఇందులోనే నీ మనిషి చచ్చిపడి ఉన్నాడు.

త్రి: అతని ముఖాన్నొకసారి చూస్తాను. ఏదీ? ఒకసారి దీపం తీసుకురా! 

సు: అయ్య బాబోయ్! లాభం లేదు.

త్రి: ఏమిటీ? హత్య చెయ్యగలవు గాని, హతుడి ముఖమ్మీద మృత్యువును చూడడానికి భయమా?

సు: నేను భయపడేది అందుకు కాదు. రాత్రి పహరా కాసే వాళ్ళకు.  నేను మాత్రం దీపం ఇయ్యను. అయినా, నా పని పూర్తయిపోయింది. నా డబ్బులు నాకిచ్చెయ్!

(త్రిభుల  అతనికి నాణేలు ఇచ్చి, శవాన్ని పరిశీలించడానికి సమాయత్తమవుతుంటాడు సంచిని చేతితో తడుముతూ)

త్రి: ఇది శవమే! సందేహం లేదు.  (తనలో) చివరకు ద్వేషానికి కూడా దాని సంతోషసమయాలు దానికుంటాయేమో!

సు: నది ఒడ్డుదాకా నేను సాయం చెయ్యనా?

త్రి: అక్కరలేదు. నేనొక్కడినీ చూసుకోగలను.

సు: మరేం లేదు. మరో రెండు చేతులేస్తే పని సుళువవుతుందని! అంతే!  

త్రి: ఇది నాకు చాలా ప్రాణప్రదమైన వస్తువు. అందుకని నాకు తేలికగానే అనిపిస్తుంది.

సు: సరే! మీ ఇష్టం. కానీ, దీన్ని ఇక్కడనుండి నదిలోకి విసిరెయ్యొద్దు! ఇక్కడలోతు తక్కువ. (గోడకు దూరంగా  ఇంకొక జాగా చూపిస్తూ)  అక్కడ ప్రవాహం చాలా లోతుగా, జోరుగా ఉంటుంది.  ఊఁ! ఊఁ! తొందరగా కానీ! గుడ్ నైట్!

(అతను ఇంటిలోనికి పోయి తలుపు వేసుకొనును)

**  **  ** 
సశేషం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: