రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 5 వ భాగం

ద్వితీయాంకం  దృశ్యం 5

[బాహుదా,  దర్బారు ప్రనుఖులు,  కొంతసేపు పోయిన తర్వాత త్రిభుల.

బాహుదా డాబా మీదకు వచ్చును.   ఆమె ఇంటికి ఆవలిముఖంగా ఉంటుంది. చేతిలో ఒక దివిటీ ఉంటుంది. దాని వెలుగు ఆమె ముఖంపై పడుతూంటుంది.]

బాహుదా: మధుపాయి! ఆహా! ఎంత తియ్యనైన పేరు!  నా మనోఫలకంపై శాశ్వతంగా  ముద్రించబడుతుంది.

(ఇంటి బయట)

పెన్న: (తక్కిన వారుతో) సాత్త్వికులారా! అ.. త.. ను కాదు…. ఆమె!

గద్దే:  ఎవరో మధ్యతరగతి సుందరి. … (ఆమెను సంభోదిస్తున్నట్టూగా)  నిన్ను చూస్తుంటే నాకు జాలివేస్తుంది. నువ్వెప్పుడూ నీచులవేటకోసమే  నీ వలలు పన్నుతుంటావు!

(అతను మాట్లాడుతుండగా బాహుదా ఇంటిముఖంగా తిరుగుతుంది. ఇప్పుడుకాంతి ఆమె ముఖం మీద పూర్తిగా పడుతుంది.)

పె: ఆమె గురించి నీ అభిప్రాయం ఏమిటి?

మరువీచి: కళగాఉన్న ఒక సామాన్య స్త్రీ.

గ: ఒక దేవకన్య- ఒక అప్సరస-సహజ సుకుమారి.

పార్థివన్: ఈమె అటువంటి ప్రభులకు ప్రియురాలా? పరమ నీచుడు.

గ: గుణహీనుడు.
మరు: ఆటవికతకు అందం ఆలంబన! సహజమే!  దేముడికి  ఇలాంటి జోడీ కుదర్చాలని వింత వింత ఆలోచనలు కల్గుతుంటాయి.

పె: చాలు! ఆపండి! మనం వచ్చింది త్రిభులను శిక్షించడానికి. మనం అందరమూ దానికోసం కంకణ బధ్ధులమై, సమాయత్తులమై ఉన్నాము. మన క్రోధానికి తోడుగా ఒక నిచ్చెన కూడ చేతిలో ఉంది. మనం గోడలు ఎక్కి, అందాన్ని బందీ చేసి, రాజప్రాసాదానికి తీసుకుపోదాం. ప్రభువులు ఉదయం మేల్కొనగానే దాన్ని పలుకరిస్తారు.

కాశ్యప: తన న్యాయమైన హక్కుగా కైంకర్యం చేసుకుంటాడు.

మరు: అపుడు ఆటవిక న్యాయం దానంతట అదే జరుగుతుంది.

గ: ఆమె ఒక ఆణిముత్యం. కిరీటంలో ధరించవలిసిన  కలికి తురాయి.
(ఆలోచనలలో మునిగి త్రిభుల  ప్రవేశం)

త్రి: నేను ఎందుకు వెనక్కి తిరిగి వచ్చేను?  ఎందుకో నాకే తెలీదు. నన్ను ఆ ముదుసలి శపించేడు.
( చీకటిలో తొట్రుపాటు పడి గద్దేను తన్నుకొనును)   ఎవరక్కడ?

గ: ( మిగతా కుట్రదారులవద్దకు పరుగెత్తి గుసగుసలాడును)
సాత్త్వికులారా, వాడు త్రిభుల!

కాశ్యప: అయితే రెట్టింపు విజయమన్నమాట.  దుర్మార్గుణ్ణి ఇప్పుడే మట్టుపెట్టేద్దాం.

పె: లాభంలేదు. అలా అయితే రేపు వాణ్ణి ఆటపట్టించడం ఎలా కుదురుతుంది?

గ: వాణ్ణి చంపేస్తే సరసంలో ‘రసం’ ఉండదు.

కా: వాడు మన పథకాన్ని పాడు చేస్తాడు.

మరు: ఫర్వా లేదు. అంతా నాకు వదిలేయండి. అన్నీ నేను చూసుకుంటాను.

త్రి: (తనలో) ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరు: (త్రిభులను సమీపించి) ఎవరది? త్రిభులేనా?

త్రి: (కోపంగా) ఎవరది?

మరు: నన్ను తినేసేలా చూడకు.  నేను!

త్రి: నేనంటే?

మరు: మరువీచిని.

త్రి: ఇంతరాత్రివేళలోనా?

మరు: ఏదో అదృశ్య హస్తం ఆకశాన్ని సిరాబుడ్డీగా మార్చింది.

త్రి: నీకిక్కడ ఏం పని?

మరు: ఏం పనా? నువ్వు ఊహించగలవులే.  కాశ్యప భార్యని రాజుగారికోసం ఎత్తుకెళ్లడానికి.

త్రి: (సంతోషంతో) ఓహ్! అద్భుతం!

కా: వెధవకి మక్కలు విరగబొడిచేద్దామనిపిస్తోంది.

త్రి: అలాగయితే, మీరామెగదిలోకి ఎలా ప్రవేశించగలరు?

మరు: (కాశ్యపతో)  ఏదీ మీ తాళం చెవి ఒక్క సారి. కాశ్యప తాళంచెవి ఇచ్చును. దాన్ని త్రిభులకు ఇస్తూ..
ఇదిగో తాళంచెవి. దీనిమీద కాశ్యప ముద్ర ఉంది. పరీక్షించి చూడు. దీనితో పని సులభం అవుతుంది.

త్రి: ( తనలో, తాళంచెవి తణుముతూ)నిజమే. మూడు రంపపు ముళ్ళు. ఆ ముద్ర నాకు గుర్తే. ఇంతకీ అతని ఇల్లు ఇక్కడే ఉంది కదూ. నేనెంత తెలివితక్కువ వాడిని!

(తాళం మరువీచికి తిరిగి ఇస్తూ)

ఆ లావుపాటికాశ్యప భార్యను ఎత్తుకెళ్ళడమే మీ ప్రయత్నమైతే నన్ను కూడ మీతో చేర్చుకోండి

మరు: మరి మాకందరికీ ముసుగులున్నాయే!

త్రి: అయితే నాకు కూడ ఒక ముసుగు ఇవ్వండి.

(మరువీచి ఒక ముసుగు తెచ్చి చేతిరుమాలుతో త్రిభుల కళ్ళు కనపడకుండా, చెవులు విపడకుండా గట్టిగా ముడివేస్తాడు.)

మరు: మరేమిటి? అలాంటి కాళ రాత్రి ఇది.

(మిగతా దర్బారు ప్రముఖులతో) మీకు ఎలాతోస్తే అలా మసలు కొండి. మాటలు సహజంగానే  ఉండనీయండి. వాది కళ్ళకి గంతలు కట్టడం వల్ల  వాడికి కనిపించదు, వినిపించదు.

మరు:  (త్రిభులతో) అలాగయితే నువ్వు నిచ్చెనదగ్గరే కాపలాకాయి.

త్రి: ఇక్కడ చాలా మంది ఉన్నారా?  నాకేం కనిపించడం లేదు.

మరు: మరేమిటి? అలాంటి కాళరాత్రి ఇది.

(ఇతర దర్బారు ప్రముఖులతో) మీకు ఎలా తోస్తే అలా మసలు కొండి. మాటలు సహజంగానే ఉండనీయండి.  వాడి కళ్ళకు గంతలు కట్టడం వల్ల కనిపించదు, వినిపించదు.

[కొందరు నిచ్చెననెక్కి లోనకి ప్రవేశించి, డాబా తలుపు తోసుకుని లోనకి ప్రవేశిస్తారు.  కొ,తసేపటికి ఒకరు లోపలనుండి గడియ తీయగా- అందరూ బయటకు – సగం తెలివితప్పి ఉన్న  బాహుదాను మోసుకుంటూ వస్తారు. వాళ్ళు రంగస్థలిని వీడిన తర్వాత – దూరం నుండి బాహుదా గొంతు వినిపిస్తుంది]

బా: (దూరం నుండి) అయ్యో! రక్షించండి! రక్షించండి! నా…. న్నా!

సభికులు: (దూరం నుండి) విజయం మనదే! ఆమె మనదే!

త్రి:  ( నిచ్చెన అడుగు మెట్టు మీద కూర్చుని)

ఎంతసేపు నేను ఈ నిచ్చెన దగ్గర కంచిగరుడ సేవ చెయ్యడం? వాళ్ళ పని ఎంతకీ పూర్తికాదేమిటి?  ఇక లాభంలేదు. నిరీక్షించడం నా వల్ల కాదు.  ముసుగు తొలగించి- దానికి పట్టీ ఉన్నాదని గ్రహించి, అయ్యో! నా కళ్ళకు గంతలు కట్టేసారే!
వాళ్ళు విడిచిపెట్టిపోయిన లాంతరు వెలుగులో ఏదో కనిపిస్తే తీసి, అది బాహుదా వాణీ గా గుర్తించి  చుట్టూ పరికిస్తాడు. ఆ నిచ్చెన తన భవంతి గోడకే ఉండడం గమనించి, సగం తెరిచి ఉన్న తలుపు చూసి పిచ్చివాడిలా బా… హు…దా అంటూ పరుగులు పెడతాడు.

భద్రదను బయటకు ఈడ్చుకు వస్తాడు.  ఆమె చిందరవందర ఐన రాత్రి దుస్తులలో వచ్చీరాని మెలకువలో ఉంటుంది. మతి భ్రమించిన వాడై నాలుగు ప్రక్కలా  కలయ తిరుగుతాడు. జుత్తు పీక్కుంటాడు- పైకి వినీ వినిపించని  మాటలు గొణుగుతుంటాడు.

చివరకు గొంతు పెగిలి ఒక్కసారి దుఃఖం పెల్లుబికి బావురుమంటాడు…

అబ్బా! శాపం నిజమయింది!

(మూర్ఛపోతాడు.)

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: